ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేది అని కడియం శ్రీహరి కామెంట్స్ చేశారు. నాకు అవకాశం వస్తే మీరందరూ నన్ను ఆశీర్వదించిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగర వేసుకొని చెప్పే విధంగా నా పనితీరు ఉంటుంది..
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై పరోక్షంగా విమర్శించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అధికారం మదంతో కొంత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. కబ్జాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయి.