Asin: ప్రస్తుతం స్టార్ హీరోయిన్ విడాకులపై చర్చ నడుస్తోంది. అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. గత కొన్నాళ్లుగా ఆమె చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. అసిన్ తన వ్యక్తిగత జీవితం కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆమె తన సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి తన భర్తతో ఉన్న అన్ని చిత్రాలను తొలగించింది. అంతే కాదు ఆమె పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అందం, అభినయం కలగలిసిన అసిన్. అసిన్ తన అందం నటనతో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకుంది.
దీంతో ఆమె భర్త నుంచి విడిపోనుందనే చర్చలు మొదలయ్యాయి. ఈ నటి బాలీవుడ్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన చిత్రం ‘గజనీ’. ఈ సినిమాలో హిందీలో అమీర్‌ఖాన్‌తో, తమిళ్ లో సూర్యతో కలిసి ఆమె కథానాయికగా నటించింది. ‘గజని’ సినిమా నటిగా గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత హిందీలో అక్షయ్ కుమార్ తో కలిసి కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించింది. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే 2016లో మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకుంది.
Read Also:Bhatti Vikramarka: సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న భట్టి పాదయాత్ర
ఇప్పుడు అసిన్ వైవాహిక జీవితంలో తుఫాను వచ్చిందంటున్నారు. ఆమె భర్త నుంచి విడిపోబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరు మారుమోగిపోయింది. నిజానికి అసిన్, ఎంఎస్ ధోనీ గతంలో ఒక వాణిజ్య ప్రకటనలో కలిసి పనిచేశారు. అక్కడ మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత పరిచయం స్నేహంగా మారింది. ఆ సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. చివరగా, ధోనీ సాక్షి రావత్‌ను వివాహం చేసుకున్న తర్వాత, ఈ చర్చలన్నీ ముగిశాయి.
లక్ష్మీ రాయ్, దీపికా పదుకొనెలతో ఎంఎస్ ధోనీ కొన్నాళ్లు డేటింగ్ చేశాడని వార్తలు కూడా వచ్చాయి. సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘రెడీ’ సినిమా షూటింగ్ కోసం అసిన్ శ్రీలంకలో ఉంది. ఆ సమయంలో టీమిండియా కూడా శ్రీలంకలో పర్యటిస్తోంది. ఆ సమయంలో ధోనీ, అసిన్ ఒకే హోటల్‌లో దిగారు. ఆ సమయంలో ఇద్దరూ కలిశారు. ఆ సమయంలో ధోనిని కలవడం పట్ల అసిన్ చాలా సంతోషించింది. ఈ సందర్భంగా ఆయనను కలుసుకుని వ్యక్తిగతంగా విష్ చేయగలిగాను అని అసిన్ అప్పట్లో చెప్పింది.
Read Also:Apsara Rani Hot Pics: అప్సర రాణి అందాల జాతర.. ఆ థండర్ థైస్‌కి కుర్రకారుకు కంటిమీద కునుకు కష్టమే!