బీఏసీని సంప్రదించకుండా 3 రోజులకె పరిమితం చేశారని, ఇది కేసీఆర్ అహంకారనికి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం, అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రజానీకం 2 వ సారి అధికారం కట్టబెట్టిన తరువాత శాసనసభ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని అన్నారు. శాసన సభ్యులను గడ్డి పోచల్లగా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలు 2- 3 రోజులకే పరిమితం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పోయినసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడం పై అడిగినందుకు మమ్మల్ని అకారణంగా సస్పెండ్ చేశారని అన్నారు. చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మాకు వినతులు వస్తున్నాయని ఈటెల తెలిపారు.
వీఆర్ఏ, గ్రామ కార్యదర్శులు, గెస్ట్ లెక్చరర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణ గడ్డ మీద ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు. ముఖ్యమంత్రి మాకు 6,12,13 వ తేదీ మాత్రమే సమావేశాలు అని నోటీసులు పంపారని మండిపడ్డారు. చరిత్రలో ఎప్పుడు ఇంత తక్కువ సమావేశాలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఏసీని సంప్రదించకుండా 3 రోజులకె పరిమితం చేయడం దారుణమన్నారు. ఇది కేసీఆర్ అహంకారనికి నిదర్శనమని పేర్కొన్నారు. పోడు భూములు,దళిత బంధు ప్రజా సమస్యలపై ప్రభుత్వ మెడలు వంచుతాయని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 17ను మరిచిపోయారని విమర్శించారు. అమిత్ షా స్వయంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా జరిపి అండగా ఉంటామని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చిందని అన్నారు.
CM Jagan Live : Sri Mekapati Goutham Reddy Sangam Barrage Inauguration and Public Meeting