Etela Rajender : 30 లక్షల మంది నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ కు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో నిలబడి కొట్లాడిన వారు విద్యార్థులు అని ఆయన అన్నారు. గత అనేక సంవత్సరాలుగా తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. గత పది సంవత్సరాలుగా గ్రూప్-1 ఎగ్జామ్స్ జరగలేదు. 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో మోసపోయాం అని గమనించి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే మాకు నోటిఫికేషన్ వస్తాయని భావించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో నమ్మి ఓట్లు వేశారు. ఉద్యోగ కేలండర్ విడుదల చేస్తాం… 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ, ఆరు నెలలు గడిచినప్పటికీ ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు.
అంతేకాకుండా..’చదువుకునే విద్యార్థులు ఎక్కువయ్యారు కాబట్టి.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వటమే కాకుండా, జాబుల సంఖ్య కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నాను. ఒక ఎగ్జామ్ కు ఇంకో ఎక్సామ్ కి కనీసం ఒక నెల అయినా గ్యాప్ ఉండేలా చూడాలని కోరుతున్నాను. మోతిలాల్ నాయక్ గత ఏడు రోజులుగా గాంధీ హాస్పిటల్ లో దీక్ష చేస్తున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ వచ్చిన పాపానపోలేదు. ముఖ్యమంత్రి అసలుకే ముఖం చాటేస్తున్నారు. ఏ సంకల్పం కోసం అయితే మోతిలాల్ దీక్ష చేస్తున్నారో దానిపైన వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. గ్రూప్స్, డీఎస్సీ ఎలాంటి పోస్టులైనా ఒక ప్రకటన చేసి ఎన్ని ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇస్తారు…నెల విరామంలో ఎలా ఎగ్జామ్స్ నిర్వహిస్తారో చేస్తారో ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఇప్పటికే నిరుద్యోగులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ప్రజాక్షేత్రంలో.. ఉద్యమాలు కూడా చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాను.’ అని ఈటల రాజేందర్ అన్నారు.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
తాజావార్తలు
-
Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్‌ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
-
Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్‌కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!