Etela Rajender: ఉపఎన్నికల్లో కేసీఆర్ నన్ను చేపను రాకినట్టు రాకిండు.. ఈటల కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: ఉపఎన్నికల్లో కేసీఆర్ చేపను రాకినట్టు రాకిండని బీజేపీ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఈటల మాట్లాడుతూ.. నేను ఈసారి డబ్బులు ఖర్చుపెట్టే స్థితిలో లేనని అన్నారు. ధైర్య లక్ష్మి మాత్రమే నా దగ్గర ఉందని తెలిపారు. బెల్ట్ షాపులు బంద్ చేస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొనివచ్చారని తెలిపారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే గ్రామపంచాయితీ సఫాయి కార్మికులకు కూడా జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. బలహీనవర్గాలకు రాజ్యాధికారం రాలేదు కాబట్టి మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. మొత్తం తెలంగాణ ఓట్లు వేస్తేనే బీసీ సీఎం సాధ్యం అవుతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు ఇస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారు. సొంత ఇంటికల నిజం చేస్తామన్నారు. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉచితంగా అందిస్తామన్నారు. నాణ్యమైన వైద్యం ఉచితంగా అందిస్తామన్నారు. ముసలివాళ్లు ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు. రైతు కూలీలులకు కూడా 5 లక్షల భీమా అందిస్తామని తెలిపారు. మహిళలకు ఇన్సూరెన్స్ డబ్బులు మేమే కడతామన్నారు.
ఒక్క కేజీ తరుగులేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం దేశంలో బెల్ట్ షాపులు పెట్టి తాగిపించడంలో తెలంగాణ నంబర్ వన్ అని తెలిపారు. మద్యం మీద ఆదాయం 10,700 కోట్లు ఉంటే 45 వేల కోట్లు అయ్యిందని ఈటల అన్నారు. బెల్ట్ షాపులు బంద్ చేస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొనివచ్చారని అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే గ్రామపంచాయితీ సఫాయి కార్మికులకు కూడా జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో పుట్టబోయే బిడ్డమీద కూడా లక్ష 25 వేల రూపాయల అప్పుతో పుడుతుందన్నారు. కంచే చేనును మేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కట్టుకున్నవాడే కాలయముడు అయ్యాడని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ఓటు వేసినందుకు మాభూములు గుంజుకున్నారు అని గజ్వేల్ వారు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఆ ఆవేదన తీర్చేందుకే కేసీఆర్ ను ఓడించడానికి వెళ్తున్నానని అన్నారు. నిరుద్యోగుల చావులు ఆగాలన్నారు. పెన్షన్ ఇస్తే సంబరపడుతున్నాం కానీ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వలేదు అనే విషయం మర్చిపోతున్నామన్నారు.
Israel Hamas War: గాజాలోని ఓ ఇంట్లో క్షిపణి దాడి.. ఒకే కుటుంబానికి చెందిన 26మంది మృతి
Also Read
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!