Site icon NTV Telugu

Etela Rajender: బీజేపీకి అధికారం ఖాయం

etela

etela

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. పెన్షన్ల పేరుతో వృద్ధుల వితంతువులు, ఒంటరి మహిళల ఓట్లను దండుకొని అధికారం లోకి వచ్చిన తరువాత మహిళలను మోసం చేసిన ఘనుడు ముఖ్యమంత్రి. దేశంలో ఏ రాష్ట్రంలో వడ్ల సమస్య లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉందన్నారు.

ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని, రైతులను మోసం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అధికారం చెలాయిస్తున్న కుటుంబం కేసీఆర్‌ కుటుంబం మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను, మంత్రులను కేసీఆర్ పట్టించుకోడన్నారు. వాళ్ళు చెప్పిన సమస్యలను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ఏ నిర్ణయమైన కేసీఆర్ తీసుకుంటాడని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి అయోమయంలో పడ్డాడు,

ఎప్పుడైన గంటలకొద్దీ ప్రెస్ మీట్స్ ఉన్నాయా? మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నాడు.రాష్ట్రంలో రాబోవు రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయం అన్నారు ఈటల. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. కొమురం భీం జిల్లాలో ఈటల పర్యటించారు.

https://ntvtelugu.com/ap-ministers-power-is-gone-rush-is-also-gone-at-their-houses/

Exit mobile version