Site icon NTV Telugu

Etela Rajender : నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు.. బీజేపీ హై కమాండ్ తెలంగాణపై సీరియస్‌గా ఉంది

Etela Rajender

Etela Rajender

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బీజేపీని వీడుతున్నట్లు వార్తలు షికార్లు కొడుతున్నాయి. అయితే.. తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ పర్యటనపై ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. అమిత్ షా, సునీల్ బన్సల్ ను కలిశానని, తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు సాధించే అంశంపై చర్చించామన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వెళ్లగొడితే బీజేపీ నన్ను అక్కున చేర్చుకుంది… ధైర్యం ఇచ్చిందని ఆయన వెల్లడించారు. నేను పార్టీలు మారే వ్యక్తిని కాదని, బీజేపీ హై కమాండ్ తెలంగాణ పై సీరియస్ గా ఉందని ఆయన వెల్లడించారు.

Also Read : Telangana Cabinet : 111 జీవో ఎత్తివేత.. VRAల రెగ్యులర్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం.. వారిపై పీడీయాక్ట్‌..

తెలంగాణలో అధికారం సాధించడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని, పార్టీ అధిష్టానం ఇచ్చే కార్యాచరణను అందిపుచ్చుకోవడానికి మేము రెడీగా ఉన్నామని ఈటల తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ సీనియర్ నేతలు మాతో మాట్లాడుతున్నారని, ఆపరేషన్ ఎప్పుడు ప్రారంభిస్తారని ఇతర పార్టీల నేతలు అడుగుతున్నారన్నారు. కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంలో గెలవగానే ఏదో ఊహించుకుంటున్నారని, మేము క్షణికావేశంలో ఉన్న వాళ్ళం కాదు.. పూటకో మాట మాట్లాడే వాళ్ళం కాదన్నారు. మాట్లాడే ప్రతివారికీ జవాబు చెప్పే వారిమి కాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేతలందరూ సమిష్టిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు ఈటల.

Also Read : Revanth Reddy : నేను ఓ మెట్టు దిగి వస్తా ఆలోచించండి.. కలిసి పనిచేద్దాం..

Exit mobile version