Etela Rajender : దానం నాగేందర్ కు ఎట్లా ఎంపీ సీట్ ఇస్తారు..? అని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తాత్కాలిక పేరు కోసం, చప్పట్ల కోసం నా ప్రసంగం ఉండదు అది నా విధానం కూడా కాదన్నారు. ఒకరిని కించ పరిచే విధంగా రాజకీయ వ్యవస్థ ఉండకూడదనే కోరుకునే మొదటి వ్యక్తిని అన్నారు. చరిత్ర నిర్మాతలు ప్రజలే కాబట్టి ఆ ప్రజలనే నేను నమ్ముకున్నారని తెలిపారు. ఆరు దశాబ్దాలు దేశాన్ని, నాలుగు దశాబ్దాలు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించిందని అన్నారు. అనేక డిక్లరేషన్ లు, అనేక పాలసీలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిందన్నారు. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని తెలిసి, ఇచ్చిన హామీలు అమాలువుతాయా అనే అవగాహన కాంగ్రేస్ కు ఉందా..? అని ప్రశ్నించారు.
Read also: Allu Arjun: ఆ లెటర్ పూర్తిగా చదవలేదు.. కానీ ఆశ్చర్యపోయాను: అల్లు అర్జున్
అవగాహన లేక హామీలు ఇచ్చారా.. లేక తప్పుడు హామీలతో అధికారంలోకి రావడానికి హామిలిచ్చారా అనేది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డికి ఒక మంచి అవకాశం ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాక ధరణి సమస్యల మీద దృష్టి పెడతారని అనుకున్నామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యం మీద దృష్టి పెడతారని అనుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో పంటలెండి కరువు దాపరించడానికి కారకులెవరో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ దారిలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే రెండు లక్షలు రైతు రుణ మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది రుణ మాఫీపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
Read also: Narudi Brathuku Natana: ‘నరుడి బ్రతుకు నటన’ ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల!
ప్రతి మహిళ అకౌంట్లో 2500 వేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. 17 కు 17 పార్లమెంట్ సీట్లు గెలిపించండని కాంగ్రెస్ అడుగుతోందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే పనేనా..? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 280 సీట్లు ఉంటే ప్రధాని అయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో 17 సీట్లు వస్తె రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా..? అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి దళితుడు కాదన్నారు, వరంగల్ ఎంపీ సీట్ ఎట్లా ఇస్తారు..? అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లోకి ఎట్లా తీసుకున్నారు..? అని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ యాంటీ డిబెక్షన్ చట్టం తెచ్చారు.. మీరు మాత్రం ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. దానం నాగేందర్ కు ఎట్లా ఎంపీ సీట్ ఇస్తారు..? అని ప్రశ్నించారు.
Read also: Ambati Rambabu : చంద్రబాబుకు నన్ను విమర్శించే నైతిక హక్కు లేదు
కొడంగల్ లో ఓడిపోతే రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేయలేదా..? నాడు రేవంత్ రెడ్డి బంగపడి, అవమాన పడి వస్తె మల్కాజిగిరి ప్రజలు అక్కున చేర్చుకున్నారా లేదా..? మల్కాజిగిరి రేవంత్ అడ్డనా..? అని ప్రశ్నించారు. ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టిన హుజూరాబాద్ లో ప్రజలు నన్ను గెలిపించారన్నారు.
ఊరల్ల ఒకదారి అయితే, ఊసర వెల్లిలది మరోదారి అన్నట్టు ఉంది రేవంత్ రెడ్డి తీరు అంటూ మండిపడ్డారు. నిన్నటి దాకా ఒక పార్టీ ఇవాళ అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వారంతా రేపు ఇంకో పార్టీలోకి వెళ్లారని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇస్తుందా..? అన్నారు. మల్కాజిగిరి ప్రజలు ఆలోచన చేయాలన్నారు. మోడీ వచ్చాక దేశంలో టెర్రరిస్ట్ ల బాంబుల మోత లేదు, కాశ్మీర్ ప్రశాంతంగా ఉందన్నారు. నాడు మేడిన్ చైనా.. నేడు మోడీ హాయంలో మేడిన్ ఇండియా అన్నారు. మల్కాజిగిరి ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలను బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నా అని తెలిపారు.
K. Laxman: తుక్కుగూడ లో కాంగ్రెస్ బహిరంగ సభ విఫలమైంది..