Narudi Brathuku Natana Movie First Look and Glimpse Relesed: ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులతో వరుస ప్రాజెక్ట్‌లను తెరకెక్కిస్తోంది. మంచి చిత్రాలను అందించే క్రమంలో ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా కేరళలో జరిగింది. కేరళ ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నరుడి బ్రతుకు నటన సినిమాలో కేరళ అందాలే హైలెట్ కానున్నాయి.
నరుడి బ్రతుకు నటన మూవీని రిషికేశ్వర్ యోగి తెరకెక్కిస్తున్నారు. శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూఛిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విడుదలకు ముందే దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: Sunny Leone: ఎంగేజ్‌మెంట్ అయ్యాక ఇష్టం లేదని చెప్పి.. నా మనసు ముక్కలు చేశాడు: సన్నీ లియోన్
నరుడి బ్రతుకు నటన నుంచి తాజాగా ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల అయ్యాయి. గ్లింప్స్ చూస్తుంటే కేరళను అలా చుట్టి వచ్చినట్టుగా, మన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా, ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపిస్తోంది. నవ్వు, బాధ, ప్రేమ, స్నేహం ఇలా అన్ని ఎమోషన్స్‌ను ఎంతో సహజంగా చూపించినట్టుగా అనిపిస్తోంది.