Site icon NTV Telugu

KTR Chit Chat: ముందస్తు ఎన్నికలపై స్పందించిన కేటీఆర్

Ktr Chit Chat

Ktr Chit Chat

పెరేడ్ గ్రౌండ్ లో వీళ్ళకన్న పెద్దగా మీటింగ్‌ పెట్టాం. మాకు ఇవన్నీ కొత్త కాదు.. వాళ్ళు మా పార్టీ లో ఉన్న కొందరు బలమైన నేతలను తీసుకోవచ్చు..పోతే కొంత మంది పోతారు… తప్పు బట్టేది ఏమి లేదంటూ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని బిజెపి నేతలు విర్రవీగడం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు కేటీఆర్‌. ఈడి లాంటి సంస్థలను వాడి తమకు కావాల్సిన వారికి ఎయిర్ పోర్టును ఇప్పించుకున్నారని అన్నారు. గాడ్సే దేశ భక్తుడు అని ఒక బిజెపి ఎంపి అంటుంది, వాణ్ణి చంపండి వీన్ని చంపండి అనడం మాత్రం అన్ పార్లమెంటరీ కాదు? గోలి మారో సాలో కి అనడం పార్లమెంటరీ పదం ఆ అంటూ ప్రశ్నించారు. ఎవరు ఏమి తినాలో, ఎవరు ఏమి బట్టలు వేసుకోవాలని చెప్పుకోవడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు కేటీఆర్‌.

కెసిఆర్ దొర అయితే మా మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన వారి స్వేచ్ఛగా తిరిగే వారా అంటూ మండిపడ్డారు. కొత్త పెన్షన్స్ ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలి వంద శాతం ఇస్తాం, డబల్ బెడ్ రూం ఇళ్లను ఇవ్వడం స్టార్ట్ చేశామని అన్నారు. రైతు బందు టైం కి ఇచ్చాము, 9 రాష్ట్రాల్లో బీజేపీ బలవంతం చేసి, అప్రజాస్వామికంగా అధికారం లోకి వచ్చారు. వాళ్ళకు తెలిసింది ఒక్కటే.. మోడీ ఈడి, జుమ్లా హమ్లా అంటూ విమర్శించారు. వీళ్ళ బల ప్రదర్శనకు భయపడే వారు ఎవరూ లేరంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. పెరేడ్ గ్రౌండ్ లో వీళ్ళకన్న పెద్దగా సభలు పెట్టాము. మాకు ఇవన్నీ కొత్త కాదు..వాళ్ళు మా పార్టీ లో ఉన్న కొందరు బలమైన నేతలను తీసుకోవచ్చు.. పోతే కొంత మంది పోతారు… తప్పు బట్టేది ఏమి లేదని వ్యాఖ్యానించారు. మా ఐడియా లాజి నచ్చిన వారు మా నాయకుని తోనే ఉంటారన్నారు. కొందరు మా పార్టీ లోకి రా వొచ్చు అని పిలుపునిచ్చారు.

read also: Live : హై అలర్ట్ భద్రాచలం వద్ద రికార్డు స్థాయికి నీటిమట్టం..! CM KCR Alerts Officials |

కాంగ్రెస్ మూడు భయంకర ఎదురు దెబ్బలు తిన బోతుండి.. హిమాచల్ , గుజరాత్, కర్ణాటక లో ఘోరంగా ఓడిపోతుందని గుర్తుచేసారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఎంత మంది మిగులుతారో చూడాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్ కూడా చాలా రాష్ట్రాల్లో ఇలానే చేసింది..రాజస్థాన్ లో బీఎస్పీ నీ మెర్జ్ చేసుకుందని గుర్తుచేసారు. నాకున్న సమాచారం ప్రకారం ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేటీఆర్‌ అన్నారు. మాకు ముందస్తు కు పోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎన్నికల డేట్స్ ఎవరు ప్రకటిస్తారో తెలియదా.. ఎవరి చేతుల్లో ఉందా తెలియదా ? అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రం వరదలతో ఇబ్బందులు పడుతుంది, కేంద్రం ఆదుకోవడం లేదు, ముందస్తు నిధులు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతు వేదికలు నిర్మించ వద్దని సూచించారు. సిగ్గుంటే తెలంగాణ లో ఎలా అసెట్స్ క్రియేట్ చేసారో దేశానికి చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసారు. వైకుంఠధామాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు జాతీయ ఉపాధి నిధులతో నిర్మించొద్ద అంటూ ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాల లాగా తిని కూర్చోవాలా అంటూ ఎద్దేవ చేసారు. శత్రు దేశాల కన్నా హీనంగా రాష్ట్రం పై కేంద్రం కక్ష కట్టిందని, ఇబ్బందులు పెడుతుంద కేటీఆర్‌ మండిపడ్డారు.

YSRCP vs Janasena: కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత..!

Exit mobile version