MLA Lakshmareddy: లక్ష్మారెడ్డిని లక్షమెజార్టీతో గెలిపిస్తాం.. మిన్నంటిన సబ్బండ వర్గాల తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Lakshmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవాబుపేట మండలం అమ్మాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ఆరా తీస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతటి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ సర్కార్ కి మద్దతు తెలుపాలని కోరారు. రేపు నవంబర్ 30వ తేదినా జరుగబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని లక్ష మెజారిటీ తో గెలిపించాలని లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా.. జడ్చర్ల నియోజకవర్గంలోని సబండవర్గాలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వెంటే ఉంటామంటూ.. కారుగుర్తుకే ఓటేస్తామని ఆయా సంఘలా ఆధ్వర్యంలో తీర్మానాలు చేస్తున్నారు.

Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ఇప్పటికే జడ్చర్ల లోని ఆర్యవైశ్య సంఘం, స్వర్ణకారుల సంఘం మరియు బిలియన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపగా నిన్న మిడ్జిల్, ఉరుకొండ మండలాల ఆర్యవైశ్య సంఘం నాయకులు కూడా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి వెంటే ఉంటామంటూ తీర్మానం చేశారు. గత తొమ్మిదేళ్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయని వివిధ రకాల వ్యాపార వర్గాలు కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నామని తెలిపారు. మంచి చేసిన ప్రభుత్వానికి మామద్దతు ఉంటుందని లక్ష్మారెడ్డిని లక్షమెజార్టీతో గెలిపించే దిశగా తామంతా కృషి చేస్తామని తీర్మానం చేస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 150 మంది నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు చంద్రప్రకాష్ రెడ్డి, రామకృష్ణరెడ్డి, సిద్ధిరాంరెడ్డి, ఆంజనేయులు.. కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకి చెందిన నాయకులందరికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అమ్మాపూర్ గ్రామం తరుపున పూర్తి మద్దతునిస్తూ కారుగుర్తుకు ఓటువేసి లక్షఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఇక మరోవైపు బాలానగర్ మండలం చింతకుంట తండాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తండాకు చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రవీందర్, వార్డు సభ్యులు రాజేశ్వరి, శ్రీనివాస్, రమేష్ సహా 100 మంది నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నూతనంగా చేరిన వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతునిస్తూ కారు గుర్తుకు ఓటువేసి లక్షఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Medigadda Barrage: మేడగడ్డకు కిషన్ రెడ్డి, ఈటల.. హెలికాప్టర్ ద్వారా బ్యారేజీ పరిశీలన
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!