NTV Telugu Site icon

G. Kishan Reddy: నన్ను గెలిపించండి.. సికింద్రాబాద్ ఎంపీగా మీ నమ్మకాన్ని నిలబెడుతాను..

Kishan Reddy Bjp

Kishan Reddy Bjp

G. Kishan Reddy: నన్ను గెలిపించండి.. సికింద్రాబాద్ ఎంపీగా మీ నమ్మకాన్ని నిలబెడుతాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ప్రతిసారి పదవిలో ఉన్న ఐదేళ్ళు ఏం చేశానో ప్రజలకు నివేదిక ఇస్తున్నానని తెలిపారు. తెలంగాణ, సికింద్రాబాద్ అభివృద్ధి కోసం చేసిన పనులను ప్రజలు తెలియజేశానని అన్నారు. కేంద్ర మంత్రిగా నాకు మూడు శాఖలను అప్పజెప్పారు మోడీ అన్నారు. కేంద్ర మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా పని చేస్తున్నానని తెలిపారు. 2004 నుంచి నాకు ఓటేసిన వారు తలదించుకునేలా చేయలేదన్నారు. నైతిక విలువలతో పని చేశానని అన్నారు. నన్ను గెలిపించండి.. సికింద్రాబాద్ ఎంపీగా మీ నమ్మకాన్ని నిలబెడుతాను అన్నారు.

Read also: Rajnath Singh: బీజేపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేదు..

నేను ఎవరి మీద దౌర్జన్యాలు చేయలేదన్నారు. భూదందాలు చేయలేదు.. కాంట్రాక్టర్లను బెదిరించలేదన్నారు. ఎవరి పైన వివక్ష చూపించలేదు.. కక్ష కట్టలేదన్నారు. పార్టీ ఆదేశానుసారం సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు. తనని ఆశీర్వదించాలని కోరుతున్నానని, నాల్గో సారి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నానని తెలిపారు. తన శ్వాస, నా ఊపిరి పార్టీనే.. పార్టీ లేకపోతే నేను లేనని అన్నారు. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాం.. ప్రచారాన్ని స్టార్ట్ చేశామన్నారు. ప్రజల ఆదరణలో కూడా ముందున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే అత్యధిక సీట్లు గెలుస్తున్నామని తెలిపారు.

Read also: Raghunandan Rao: హరీష్ రావు గట్టు మీద నిల్చున్నాడు.. కాంగ్రెస్ లోకా లేక..?

బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే మనకు ప్రధాన పోటీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. రాహుల్ గాంధీ గ్యారంటీలు ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతావు.? అని ప్రశ్నించారు. హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ శకం ముగిసిందన్నారు. బీఆర్ఎస్ కు ఒక సీటు వచ్చినా.. రాకున్నా చేసేదేం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు మేమే పోటీ, మేమే ప్రత్యామ్నాయమన్నారు.
Prakash Goud: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ప్రకాశ్ గౌడ్

Show comments