NTV Telugu Site icon

Sheep Scam: సంగారెడ్డిలో గల్లంతు అయిన గొర్రెల పంపిణీ పథకం డేటా..?

Sheep Scam

Sheep Scam

Sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ కుంభకోణంపై దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. కాగా సంగారెడ్డిలో గొర్రెల పంపిణీ పథకం డేటా గల్లంతు కావడం అధికారులకు షాక్ కు గురిచేసింది. కార్యాలయంలో కంప్యూటర్ డేటా బ్లాక్ కావడం, హార్డ్ డిస్క్ స్ట్రక్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత 10 రోజులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంత కుమారి సెలవులో ఉండటం గమనార్హం. కరోనాతో రెండున్నరేళ్ల క్రితం కార్యాలయ ఉద్యోగి మృతి చెందింది. దీంతో ఉద్యోగి చనిపోవడంతోనే గత రెండున్నరేళ్లుగా డేటా అంతా స్ట్రక్ అయి ఉందని అధికారులు చెబుతున్నారు. రెండున్నరేళ్లు అయినా డేటా రికవరీ చేయకపోవడంతో అధికారుల తీరుపై పెరుగుతున్న అనుమానాలు. మాన్యువల్ గా డేటాను సేకరిస్తున్నామంటున్న పశుసంవర్ధక శాఖ అధికారులు. ఈ నెలాఖరు వరకు విజిలెన్స్ అధికారులకి పూర్తి సమాచారం ఇస్తామంటున్నారు.

Read also: Honeymoon Express : గ్రాండ్ గా “హనీమూన్ ఎక్స్ ప్రెస్” ప్రీ రిలీజ్ ఈవెంట్.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

కాగా, గొర్రెల పంపిణీపై ఇప్పటికే ఈడీ అధికారులు పశుసంవర్ధక శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 10 అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని లేఖలో కోరారు. దీంతోపాటు గొర్రెల పంపిణీ స్కాంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కుంభకోణానికి సంబంధించిన వివరాలను కోరింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మోసానికి సంబంధించి ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గొర్రెల పంపిణీలో భాగంగా మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు తదితర వివరాలను ఈడి కోరింది. గొర్రెల కొనుగోలుకు సంబంధించి సమాఖ్య ప్రభుత్వ ఖాతాల్లో ఏ జిల్లా అధికారులు జమ చేశారనే వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ అయిన నిధులు, ఏ ఖాతాల్లో జమ చేశారు? గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి చెల్లించిన చెల్లింపుల వివరాలు, గొర్రెల కోసం కొనుగోలు చేసిన మేత, ఏ లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరెవరికి నిధులు మంజూరయ్యాయనే వివరాల కోసం ఈడీ కోరింది.
Kuwait Fire Tragedy: కువైట్ అగ్నిప్రమాద మృతుల్లో ఏపీకి చెందిన ముగ్గురు.. ఇద్దరు పెరవలి వాసులే..!