Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
- ఫాల్కన్ స్కామ్‌లో ఈడీ కీలక ముందడుగు
- హాకర్ 800A విమానం రూ.3 కోట్లకు ఈ-వేలం
- బాధితులకు విక్రయ నగదు పంపిణీకి నిర్ణయం
- రూ.792 కోట్ల పోంజీ స్కామ్‌పై దర్యాప్తు కొనసాగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Falcon Scam : ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక పురోగతి సాధించింది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈడీ అధికారులు తాము సీజ్ చేసిన ఒక విమానాన్ని ఈ-వేలం (E-Auction) ద్వారా విజయవంతంగా విక్రయించారు. హైదరాబాద్ జోనల్ ఈడీ పరిధిలో జరిగిన ఈ వేలం ప్రక్రియ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రూ. 3 కోట్లకు హాకర్ 800A విమానం విక్రయం
ఫాల్కన్ స్కామ్‌లో భాగంగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ‘హాకర్ 800A’ (Hawker 800A) చార్టర్డ్ విమానాన్ని ఈ-వేలంలో రూ. 3 కోట్లకు విక్రయించారు. అయితే ఈ ప్రైవేట్ విమానం ధర రూ.14 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. అయితే.. జూలై 1న ఎంఎస్టీసీ (MSTC) సంస్థ ద్వారా ఈడీ ఈ ఆక్షన్ ప్రక్రియను నిర్వహించింది. పీఎంఎల్ఏ (PMLA) అడ్జుడికేటింగ్ అథారిటీ ముందస్తు అనుమతితోనే అధికారులు ఈ విమానాన్ని వేలానికి ఉంచారు. కాగా, ఈ విక్రయం ద్వారా వచ్చిన రూ. 3 కోట్ల మొత్తాన్ని ఈ స్కామ్‌లో నష్టపోయిన బాధిత పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీజ్
ఫాల్కన్ పోంజీ కేసులో ప్రధాన నిందితుడైన అమర్దీప్ కుమార్‌కు ఈ చార్టర్డ్ విమానం చెందుతుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 2025 మార్చి 7న శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఈడీ అధికారులు దీనిని అటాచ్ చేసి, స్వాధీనం చేసుకున్నారు.
రూ. 792 కోట్ల భారీ మోసం
నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ (Fake Invoice Discounting) పేరుతో నిందితులు భారీ మోసానికి తెరలేపారు. అమర్దీప్ కుమార్ అండ్ గ్యాంగ్ దాదాపు రూ. 792 కోట్ల మేర బాధితులను నమ్మించి, పెట్టుబడుల పేరుతో మోసం చేసినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. ఈ భారీ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని ఆస్తుల గుర్తింపు, నిధుల మళ్లింపుపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..