ఓ మందుబాబు చేసిన తుంటరి పనికి దుబాయ్ వెళ్లాల్సిన విమానం ఆగింది. ఆగిపోవడమే కాకుండా ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులను కూడా ఉరుకులు పరుగులు పెట్టించాడు. ఇంతకీ అతను చేసిన పని ఏంటంటే.. శనివారం నాడు తన కుటుంబ సభ్యులను దేశం నుండి బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలనుకున్న ఓ తాగుబోతు.. దుబాయ్‌కి వెళ్లే ఓ ప్రైవేట్ క్యారియర్‌కు బూటకపు బాంబు బెదిరింపు చేసి పోలీసుల వలలో పడ్డాడు.