ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతే కాదు నిన్న నిర్వహించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ లో పుష్ప చిత్రానికి గాను హీరో అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడుగా అవార్డు వరించింది.పుష్ప సినిమాతో ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని గౌరవం అల్లు అర్జున్ కు దక్కింది. పుష్ప సినిమా ఘన విజయంతో పుష్ప 2 చిత్రాన్ని ఘనంగా ప్రారంభించాడు దర్శకుడు సుకుమార్.ఇందులో కూడా అల్లు అర్జున్ క్యారెక్టర్ మరింత రస్టిక్ గా డిజైన్ చేసాడు సుకుమార్ అలాగే ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి అయింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
పుష్ప పార్ట్ 2పై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి.అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా పుష్ప 2 కి సంబంధించి టీజర్ ని విడుదల చేయడం జరిగింది. అలాగే అమ్మవారి గెటప్ లో అల్లుఅర్జున్ పోస్టర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. దీనితో ఈ సినిమాపై అంచనాలను మరింత పెరిగాయి. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ పుష్ప-2 మేకర్స్‌కి ఐటం సాంగ్ తప్పని తిప్పలు తెచ్చిపెడుతోందట. ఇక పుష్ప పార్ట్1 లో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.అందుకు తగ్గట్టుగానే పార్ట్ 2 లో ఐటమ్ సాంగ్ ని చిత్రీకరించాలి అని చూస్తున్నారట డైరెక్టర్ సుకుమార్.అయితే ఈ సాంగ్ కి ఒక స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నారట సుకుమార్.అయితే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నదానిపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ బ్యూటీలను సంప్రదించగా వారు కూడా నో చెప్పినట్టు సమాచారం.. సుకుమార్ ఈ ఐటమ్ సాంగ్ కోసం మరి ఏ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటారో చూడాలి.