Viral News: ‘పోలీస్ మామల స్క్వాడ్’.. మందుబాబుల వాట్సాప్ గ్రూప్‌లో షాకిచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ
- డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునే మాస్టర్ ప్లాన్ బట్టబయలు
- వాట్సాప్ గ్రూప్‌తో పోలీసులను మోసం చేసే ప్రయత్నం
- ట్రాఫిక్ ఎస్ఐ ఎంట్రీతో మందుబాబులకు షాక్
- ‘స్పెషల్ అవేర్నెస్’తో పోలీసుల కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మందుబాబులు వేసిన ఒక మాస్టర్ ప్లాన్ డైరెక్టుగా పోలీసులకే దొరికిపోయింది. పోలీసులు ఎక్కడెక్కడ చెకింగ్ చేస్తున్నారో ముందే సమాచారం తెలుసుకునేందుకు వారు ఏకంగా ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. అయితే, ఆ గ్రూప్‌లోకి నేరుగా ట్రాఫిక్ ఎస్ఐ ఎంట్రీ ఇవ్వడంతో మందుబాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
గోదావరిఖని ప్రాంతంలో కొంతమంది మందుబాబులు కలిసి “పోలీస్ మామల స్క్వాడ్” పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను ప్రారంభించారు. కేవలం ఇద్దరితో మొదలైన ఈ గ్రూప్, చూస్తూనే వేల మంది సభ్యులకు చేరుకుంది. ఈ గ్రూప్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. పట్టణంలో ఎక్కడైనా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుంటే, వెంటనే ఆ లొకేషన్ వివరాలను గ్రూప్‌లో షేర్ చేయడం. దీనివల్ల మందుబాబులు ఆ మార్గాల్లో వెళ్లకుండా ప్రత్యామ్నాయ దారులను వెతుక్కుని పోలీసుల కళ్లు గప్పేవారు.
Also Read
- Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
- Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
ఇటీవల వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అతని సెల్ ఫోన్ తనిఖీ చేయగా ఈ వింత వాట్సాప్ గ్రూప్ వ్యవహారం బయటపడింది. ఆ గ్రూప్‌లోని మెసేజ్‌లను చూసిన స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ, వెంటనే అందులో ఒక సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. “అరేయ్ మామ.. నేను ట్రాఫిక్ ఎస్ఐని రా మామ.. నా మీదే గ్రూప్ పెడతారా?” అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. “నేను గోదావరిఖని మున్సిపల్ చౌరస్తాలో చెకింగ్ చేస్తున్నాను, దమ్ముంటే రండిరా మామ చూసుకుందాం” అని సవాల్ విసిరారు.
Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..
ఆ వీడియోను చూసిన మందుబాబులు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే గ్రూప్ నుండి లెఫ్ట్ అవ్వడం ప్రారంభించారు. అయితే ఎస్ఐ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా.. “ఎవరూ వెళ్ళిపోకండి, మీ అందరి నెంబర్లు సేవ్ చేసుకున్నాను, ఫోటోలు కూడా తీశాను. మీ అందరికీ త్వరలోనే ఒక స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను, అందరూ రండి” అని అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
మందుబాబుల ‘స్మార్ట్ ప్లాన్’ పోలీసుల చేతికి చిక్కడంతో ఇప్పుడు గోదావరిఖనిలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. పోలీసులు సాంకేతికతను వాడుకుని మరీ మందుబాబుల ఆట కట్టించడంతో, ఇప్పుడు ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులంతా పోలీసులకు ఎక్కడ దొరికిపోతామో అని బిక్కుబిక్కుమంటున్నారు.
తాజావార్తలు
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!