Site icon NTV Telugu

Viral News: ‘పోలీస్ మామల స్క్వాడ్’.. మందుబాబుల వాట్సాప్ గ్రూప్‌లో షాకిచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ

Whatsapp Group

Whatsapp Group

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మందుబాబులు వేసిన ఒక మాస్టర్ ప్లాన్ డైరెక్టుగా పోలీసులకే దొరికిపోయింది. పోలీసులు ఎక్కడెక్కడ చెకింగ్ చేస్తున్నారో ముందే సమాచారం తెలుసుకునేందుకు వారు ఏకంగా ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. అయితే, ఆ గ్రూప్‌లోకి నేరుగా ట్రాఫిక్ ఎస్ఐ ఎంట్రీ ఇవ్వడంతో మందుబాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

గోదావరిఖని ప్రాంతంలో కొంతమంది మందుబాబులు కలిసి “పోలీస్ మామల స్క్వాడ్” పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను ప్రారంభించారు. కేవలం ఇద్దరితో మొదలైన ఈ గ్రూప్, చూస్తూనే వేల మంది సభ్యులకు చేరుకుంది. ఈ గ్రూప్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. పట్టణంలో ఎక్కడైనా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుంటే, వెంటనే ఆ లొకేషన్ వివరాలను గ్రూప్‌లో షేర్ చేయడం. దీనివల్ల మందుబాబులు ఆ మార్గాల్లో వెళ్లకుండా ప్రత్యామ్నాయ దారులను వెతుక్కుని పోలీసుల కళ్లు గప్పేవారు.

Healthy Breakfast for Diabetics: మందులు లేకుండానే షుగర్ కంట్రోల్.. పూర్వీకులు తిన్న ఈ ‘ఆహారం’ సింపుల్‌గా ఇలా చేసేయండి!

ఇటీవల వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అతని సెల్ ఫోన్ తనిఖీ చేయగా ఈ వింత వాట్సాప్ గ్రూప్ వ్యవహారం బయటపడింది. ఆ గ్రూప్‌లోని మెసేజ్‌లను చూసిన స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ, వెంటనే అందులో ఒక సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. “అరేయ్ మామ.. నేను ట్రాఫిక్ ఎస్ఐని రా మామ.. నా మీదే గ్రూప్ పెడతారా?” అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. “నేను గోదావరిఖని మున్సిపల్ చౌరస్తాలో చెకింగ్ చేస్తున్నాను, దమ్ముంటే రండిరా మామ చూసుకుందాం” అని సవాల్ విసిరారు.

Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

ఆ వీడియోను చూసిన మందుబాబులు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే గ్రూప్ నుండి లెఫ్ట్ అవ్వడం ప్రారంభించారు. అయితే ఎస్ఐ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా.. “ఎవరూ వెళ్ళిపోకండి, మీ అందరి నెంబర్లు సేవ్ చేసుకున్నాను, ఫోటోలు కూడా తీశాను. మీ అందరికీ త్వరలోనే ఒక స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను, అందరూ రండి” అని అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

మందుబాబుల ‘స్మార్ట్ ప్లాన్’ పోలీసుల చేతికి చిక్కడంతో ఇప్పుడు గోదావరిఖనిలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. పోలీసులు సాంకేతికతను వాడుకుని మరీ మందుబాబుల ఆట కట్టించడంతో, ఇప్పుడు ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులంతా పోలీసులకు ఎక్కడ దొరికిపోతామో అని బిక్కుబిక్కుమంటున్నారు.

Exit mobile version