Voters List: తెలంగాణలో SIR ముసాయిదా జాబితా విడుదల.. మీ ఓటు లేకపోతే ఇలా చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి అధికారికంగా విడుదల చేశారు. జూన్ 25 నుంచి ఆగష్టు 10 వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ముసాయిదా జాబితా విడుదలకు ముందు రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లు ఉండగా, సర్వే ద్వారా 2,64,87,213 మంది (78.30%) నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించారు.
పరిశీలనలో 9,22,229 మంది (2.73%) మరణించినట్లు, 57,46,803 మంది (16.99%) శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలిపోవడం వల్ల అధికారులకు అందుబాటులో లేరని గుర్తించారు. అలాగే 6.70 లక్షల (1.98%) మందికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నట్లు తేలింది. సరైన వివరాలు అందించకపోవడంతో 32.2 లక్షల ఓటర్లకు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు.
Also Read
ఓటర్ల నమోదు కోసం బూత్ స్థాయి అధికారులు (BLO) ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శించారు. ప్రక్రియ సౌలభ్యం కోసం 368 కొత్త పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో మొత్తం కేంద్రాల సంఖ్య 36,353 కి పెరిగింది. సరిగ్గా వివరాలు నమోదు కానటువంటి వారు, 2002 వివరాలతో అనుసంధానం కాని వారికి ERO ల ద్వారా నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. ఆగష్టు 17 నుండి సెప్టెంబర్ 16 వరకు ఓటు కోల్పోయిన వారు, కొత్తగా నమోదు చేసుకునే వారు Form-6 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఓటరు నమోదు, సమాచార సవరణ, ఇతర సేవల కోసం ఎన్నికల కమిషన్ అందిస్తున్న డిజిటల్ పోర్టల్ https://voters.eci.gov.in/ ద్వారా దరఖాస్తులను పరిశీలించుకోవచ్చు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!