DK Aruna : సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజను బీజేపీ ఎంపీ డీకే. అరుణ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకుని, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన దురదృష్టకరమని, ఒకరి మరణం, మరొకరి తీవ్ర గాయపడడం బాధకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని, సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి మద్దతుగా నిలవాలని కోరారు.
Turkey: ఆయుధ తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 12 మంది మృతి
అయితే, ఈ ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. హీరో అల్లు అర్జున్ కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి వేధించడం వెనుక వేరే మతలబు ఉండొచ్చని, అది త్వరలో బయటపడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా దానికి కారణం ఉంటుందని, ఢిల్లీకి సూట్ కేసులు పంపించడంలో ఎక్కడో తప్పు జరిగిందని, అందుకే అల్లు అర్జున్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.
సంఘటనపై అసెంబ్లీలో చర్చించిన తీరును ఆమె విమర్శించారు. అసలు సమస్యలపై దృష్టి పెట్టకుండా దారితప్పించిన రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం గర్భితమని, దాడికి పాల్పడిన వారు రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి చెందినవారేనని పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక బలమైన కారణం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వ మద్దతు అవసరమని, రాజకీయ లబ్ధి కోసం చిల్లర రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. పుష్ప సినిమాపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను డీకే. అరుణ ఖండించారు. గతంలోనూ పోలీసులను హీరోలుగా చూపే సినిమాలు వచ్చిన మాట నిజమేనని, అలాంటి విషయాలను మరవద్దని సూచించారు.
Kollywood : నయనతార నిర్మాతగా సేతుపతి హీరోగా సినిమా..?