Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీ ఈరోజే లాస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fish Prasadam: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ఈరోజే చివరి రోజు. చేప ప్రసాదం కోసం వచ్చేవారు అది గమనించాలని అధికారులు సూచించారు. నిన్నటి మాదిరిగానే ఈరోజుకూడా ఉదయం నుంచి నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. టోకన్లను తీసుకుని అందరూ లైన్ లో నిలబడి చేప ప్రసాదం స్వీకరించాలని సూచించారు. కాగా.. బత్తిన కుటుంబీకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని. ఈ ఏడాది కూడా చేపమందు అందించనున్నందున అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు.
నిన్న ఒక్కరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చేవారు పెద్ద సంఖ్యలో వచ్చారని వెల్లడించారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడిందని పేర్కొన్నారు. రెండురోజుల నుంచే నాంపల్లి గ్రౌండ్ కు ఆస్తమాతో బాధపడుతున్నవారు బారులు తీరారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కౌంటర్లు ఏర్పాటు చేసి సీక్వెన్షియల్ ఆర్డర్‌లో ఈ మందును అందజేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు అధికారులు. మృగశిరకార్తె రోజున అందించే ఈ చేపమందు ప్రసాదం కోసం రెండు రోజుల ముందు నుంచే వచ్చి క్యూలో వేచి ఉన్నారు.
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
Read also: Ramoji Rao: నేడు ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు
అయితే చేప ప్రసాదం కోసం క్యూ లైన్ లో నిలబడిన వ్యక్తి ఒక్కసారిగా కిందికి పడిపోవడంతో అక్కడున్న వారు తట్టి లేపిన ఆ వ్యక్తిలో చలనం లేకపోవడంతో స్థానికులు అక్కడే వున్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న మహిళా పోలీసు సృహతప్పిన వ్యక్తిపై నీళ్లు చెల్లింది. వ్యక్తి స్పందించలేదు. సీపీఆర్ చేసిన ఫలితం కనిపించకపోవడంతో అంబులెన్స్ ను పిలిపించారు. వెంటనే అక్కడి నుంచి కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. అయితే సొమ్మసిల్లి పడిపోయిన వ్యక్తితో ఎవరు వచ్చారు? నిజామాబాద్ నుంచి ఆ వ్యక్తి ఒక్కడే వచ్చాడా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.
అయితే చేప మందుతో ఆస్తమా లేకుండా చేసుకుందామని వచ్చిన వ్యక్తి కానరాని లోకానికి వెళ్లిపోయాడు అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు వస్తే.. వ్యక్తే మృత్యువాత పడ్డాడని కన్నీరుమున్నీరయ్యారు. వ్యక్తి మృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనిపిస్తే వారు నిలబడిన చోటే సేదతీరాలని తెలిపారు. క్యూ లైన్ ల్లో నిలబడివారు జాగ్రత్తగా వుండాలని కోరారు.
Secendrabad: సిగ్నల్ పడుతుందని స్పీడ్ పెంచిన డ్రైవర్.. మూడు సార్లు పల్టీ కొట్టిన కారు..
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!