NTV Telugu Site icon

హరిభూషణ్ భార్య అందుకే లొంగిపోయింది..

మావోయిస్టు కీలక నేత హరిభూషన్‌ భార్య సమ్మక్క అలియాస్‌ శారద లొంగిపోయిన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి… 1994లో 18 ఏళ్ల వయస్సులోనే పాండవ దళంలో కమాండర్‌గా పనిచేస్తున్న హరిభూషన్… శారదను మైనర్‌గా ఉన్నప్పుడే పార్టీలోకి తీసుకెళ్లారని తెలిపారు. ఆమె కిన్నెర దళంలో 1997 నుండి 1998 వరకు పనిచేసిందని వెల్లడించిన ఆయన.. 1999-2000 మధ్య నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ మెంబర్‌గా… ప్లాటున్ మెంబర్‌గా పనిచేశారన్నారు.. 2008లో వరంగల్ ఎస్పీ ముందు లొంగిపోయిన ఆమె.. 2011లో తిరిగి పార్టీలో చేరిందన్న డీజీపీ.. 2016లో చర్ల ఏరియా సెక్రటరీగా ప్రమోట్ అయ్యారన్నారు.. పెళ్లి చేసుకోవాలని హరిభూషన్ బెదిరించారని తెలిపారు.. ప్రస్తుతం బ్యాక్ పెయిన్, ఐ సైట్, కడుపునొప్పితో ఆమె బాధపడుతోందన్న మహేందర్‌రెడ్డి.. హరిభూషన్ బతికిఉన్నంత కాలం ఈమెకు పార్టీలో ప్రాధ్యన్యం ఉండేది.. కానీ, ఆ తర్వాత గుర్తింపు లేకుండా పోయిందన్నారు.

ఇక, ఆరు నెలల్లో పార్టీని 20 మంది వదిలివెళ్లినట్టు పోలీసులకు పేర్లతో సహా శారద చెప్పిందన్నారు డీజీపీ మహేందర్‌రెడ్డి.. 25 కేసుల్లో నింధితురాలిగా ఉన్న ఆమె.. 6 సార్లు పోలీసుల ఎదురుకాల్పుల్లో పాల్గొన్నదని.. బులెట్ గాయం అవడంతో.. అప్పట్లో కంటిచూపు పూర్తిగా కోల్పోయిందన్నారు.. మరోవైపు.. కోవిడ్ తర్వాత మావోయిస్టులకు సరియైన చికిత్స అందట్లేదన్న ఆయన.. ఆరోగ్య కారణాలతో చాలా మంది పార్టీని వదిలి వస్తున్నారని తెలిపారు.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవండి… ప్రభుత్వం ఆదుకుంటుంది అని ప్రకటించారు.. ఇక, శారదా పేరుపై ఉన్న రూ. 5 లక్షల రివార్డును డీడీ రూపంలో ఆమెకే అందజేశారు డీజీపీ మహేందర్‌రెడ్డి.. ఇక, రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ ఆరోగ్యం బాగాలేదని తెలుస్తుంది.. లొంగిపోవాలని అప్పీల్ చేస్తున్నాం.. తన భర్తకి సరైన వైద్యం మావోయిస్టు పార్టీ ఇప్పించలేకపోయిందని శారద బాధపడుతుంది.. మరొకరు అలా ఇబ్బంది పడొద్దన్నారు.. కోవిడ్ కారణంగా పార్టీలో 10 మంది చనిపోయారని తెలిపిన డీజపీ.. తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు రావటానికి ప్రయత్నం చేయట్లేదని.. ఇప్పుడంతా ఛత్తీస్ ఘడ్ లో ఉన్నారని తెలిపారు..