డ్రగ్స్‌పై ముగిసిన డీజీపీ సమీక్ష.. వాళ్ల చిట్టా సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ వ్యవహారంపై మళ్లీ ఫోకస్ పెట్టారు తెలంగాణ పోలీసులు.. ఇవాళ డ్రగ్స్ పై డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి జంట నగరాల పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లా ఎస్పీలు హాజరయ్యారు.. డ్రగ్స్ నియంత్రణకు 1000 మందితో ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే కాగా.. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు డీజీపీ.. ఇక, సీఎంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో హై లెవల్ మీటింగ్ జరగనుంది.. డ్రగ్స్ విక్రేతలు, వాడకందారులపై తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ సమావేశంలో చర్చ జరిగింది..
ఇక, డీజీపీ నిర్వహించిన సమావేశంలో కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశారు.. డ్రగ్స్ అమ్మకందారులు, వినియోగదారుల చిట్టా తయారు చేసింది పోలీసుశాఖ.. గతంలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్లతో చిట్టా సిద్ధం అయ్యింది.. సినీ , రాజకీయ, వ్యాపార వేత్తలు, విద్యార్థుల సంబంధించిన పేర్లతో చిట్టా సిద్ధం అయినట్టుగా పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు.. డ్రగ్స్ తో పాటుగా గంజాయి తీసుకున్నవారి వివరాలను కూడా పోలీసుశాఖ పొందుపర్చింది.. మరోవైపు డ్రగ్స్ విక్రయాలపై నిరంతర నిఘాకు కొత్త యాప్‌ను రూపొందించారు.. ఆ యాప్ లో డ్రగ్స్ విక్రయదారుల సంబంధించిన పూర్తి సమాచారంతో అందుబాటులో ఉంచనున్నారు.. డ్రగ్స్ కు సంబంధించి గత పదేళ్లకు సంబంధించిన పూర్తి డేటాను తయారు చేసింది పోలీసుశాఖ.. ఇక, సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశంలో వీటిపై చర్చ సాగనుంది.. కానీ, కేసీఆర్ సమీక్షలో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్‌చేంజ్.!
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
- TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
- Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
తాజావార్తలు
-
India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్‌లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Floods: మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
-
Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్‌చేంజ్.!
-
Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
-
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి జైలుకు తరలింపు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!