BRS MLC: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన దేశపతి, నవీన్‌కుమార్, చల్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS MLC: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, చల్లా వెంకట్రామ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్‌లో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, మల్లార్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై నూతన ఎమ్మెల్సీలను అభినందించారు.
దేశపతి శ్రీనివాస్ , నవీన్ కుమార్, చల్లా వెంకట్రాంరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.. ఈ ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్ధులు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు మినహా ఇతర పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో రొటర్నింగ్ అధికారి నుండి ఎన్నికైనా అభ్యర్ధులు ధృవీకరణ పత్రాలు అందుకున్నారు.
Also Read
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో నవీన్‌కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రాంరెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును ప్రగతిభవన్‌లో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారిని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. నవీన్ కుమార్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీగా కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. కొత్తగా దేశపతి శ్రీనివాస్ కు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఆలంపూర్ నియోజకవర్గంతో పాటు రాయలసీమలో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున చల్లా వెంకట్రాంరెడ్డికి ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించారు.
తాజావార్తలు
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?