Women IAS: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్.. కారణం ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women IAS: తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజులముందే జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సదరు అధికారి ట్వీట్‌లను మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌రెడ్డి ఒకటికి రెండుసార్లు రీట్వీట్ చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటలకు నేరుగా ఆమె నివాసానికి కారులో వెళ్లాడు. తన స్నేహితుడైన హోటల్ యజమానిని వెంట తీసుకెళ్లాడు. అయితే.. తాను ఫలానా క్వార్టర్ కు వెళ్లాలని కాపలా సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం.
Read also: Telangana Congress: మూడోరోజు థాక్రే పర్యటన.. ఇవాళ్టి షెడ్యూల్ ఇదే..
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
స్నేహితుడిని కారులో వదిలి మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లాడు. ముందు స్లైడింగ్ డోర్ తెరిచి లోపలికి వచ్చి గది తలుపు తట్టాడు. డోర్ తెలిసిన మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఎదురుగా రావడంతో షాక్ తిన్నారు. కాస్త తేలికపడి నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావని గట్టిగా అడిగింది. వచ్చిన అతను నేను గతంలో మీకు ట్వీట్ చేశాను.. తన పని గురించి మాట్లాడేందుకు వచ్చానని బదులిచ్చాడని సమాచారం. దీంతో ఆగ్రహించిన ఆమె బయటకు వెళ్లాలని గట్టిగా అరిచినట్లు సమాచారం. దీంతో ముందుగా భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కారును సీజ్ చేసి డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు అతని స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read also: Gold Price: బాబోయ్ బంగారం.. కొండ మీదే ఉన్న పసిడి
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేకలు వేయడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పారిపోతున్న డిప్యూటీ తహసీల్దార్‌ను పట్టుకున్నారు. డీటీతో పాటు వచ్చిన స్నేహితుడిని కూడా స్థానిక పోలీసులకు అప్పగించారు. వారి కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రాత్రిపూట ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంటికి ఎందుకు వెళ్లాడు? ఏదైనా దురుద్దేశంతో వెళ్లాడా లేక అసలు ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వెళ్లాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండురోజుల క్రితమే ఈ ఘటన జరిగిన బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడటం గమనార్హం. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. మహిళా అధికారికే వేధింపులు ఎదురయ్యాయి అంటే నగరంలో మహిళలపై దారుణాలకు నిదర్శనమని రాష్ట్రప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంత సెక్యూరిటి వున్నా కూడా అతన్ని ఆపలేకపోయారంటూ చర్చజరుగుతుంది. ఈవార్త బయటకు రావడంతో.. తెగవైరల్ అవుతోంది.
Republic Day TerrorAttack: ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండాను ఎగురవేస్తే 5లక్షల డాలర్లు ఇస్తా ఎస్‌ఎఫ్‌జే ప్రకటన
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..