Talasani Srinivas Yadav: అభం శుభం తెలియని చిన్నారిపై దారుణ దూరాఘతానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్ లోని DAV స్కూల్ ఘటన లో బాధిత చిన్నారి బాలిక తల్లిదండ్రులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో కలిశారు. దోషులుగా ఉన్న డ్రైవర్ రజనీకాంత్, సహకరించిన ప్రిన్సిపాల్ మాధవి లను కఠనంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు.
Read also: Drunk Man: మందు బాబులం మేము మందుబాబులం.. పోలీస్టేషన్ లో తాగుబోతు వీరంగం వీడియో వైరల్
దోషుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని బాధిత తల్లిదండ్రులకు మంత్రి భరోసా ఇచ్చారు. ఇప్పటికే స్కూల్ అనుమతిని రద్దు చేసి, సీజ్ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. అయితే.. శనివారం విద్యాశాఖ అధికారులను కలిసి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అధికారులు మాత్రం తాము ఇచ్చిన ఆప్షన్స్ ఎంచుకోవాలని పేరెంట్స్ కు సూచించారు.
Malaika Arora : వయసులో చిన్నవాడు.. తప్పేంటి అంటున్న ముదురు భామ