యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని ముఠాలు రెచ్చిపోతున్నాయి. డేటింగ్ యాప్ ద్వారా మోసాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఎస్కార్ట్ సర్వీస్, కాల్ బాయ్ పేరుతో ఓ వ్యక్తి నుండి కోటి యాభై లక్షలు మోసం చేసింది ముఠా. మూడు దఫాలుగా ఈ అమౌంట్ ను తీసుకుంది ముఠా. ఈ కేసుకి సంబంధించి ఢిల్లీలో ఉన్న అరుణ్ ను అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు సీసీఎస్ జాయింట్ సీనీ గజరావ్ భూపాల్.
Read Also: Satyakumar: కేసీఆర్‌కు సవాల్.. ఒక్క బీజేపీ కార్యకర్తను లాక్కోగలిగినా ముక్కు నేలకు రాస్తా..!!
మరోవైపు నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టు రట్టు చేశారు సీసీఎస్ పోలీసులు. మహమ్మద్ సలీం, మహమ్మద్ ఆరిఫ్ లను అరెస్ట్ చేశారు. శాంసంగ్, LG , గోద్రెజ్ పేరుతో నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. గూగుల్ యాడ్స్ లో బ్రాండ్ కంపెనీల కస్టమర్ కేర్ నెంబర్ అని వీళ్ళు నెంబర్ పెట్టి మోసం చేస్తున్నారు. బ్రాండ్ కంపెనీలకు సంబంధించి రిపేర్లు పేరుతో మోసం చేస్తుంది ముఠా. రామంతాపూర్ లో ముందుగా కాల్ సెంటర్ పెట్టి టెలికాలర్ ను నియమించుకొని మోసం చేస్తున్నారు. హైదరాబాద్ , ముంబై, నోయిడా, వైజాగ్, బెంగళూర్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
స్వతహాగా వీల్లే టెక్నీషియన్ లు నియమించుకొని కంపెనీ కంటే 40శాతం పైగా రిపేర్ల పేరుతో మోసం చేస్తున్నారు. ఈ ఒక్క కాల్ సెంటర్ లోనే 555 మొబైల్స్ సీజ్ చేశాం అన్నారు. గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు ప్రజలు జాగ్రత్త పడాలని ఇలాంటి కాల్ సెంటర్ల విషయంలో అప్రమత్తంగా వుండాలన్నారు.
Read Also; Indrasena Reddy: బీజేపీ నేతలే టార్గెట్ గా అక్రమ కేసులు
