Site icon NTV Telugu

Dasoju Sravan: తెలంగాణలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలి

తెలంగాణలో యువత ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. లక్షల ఉద్యోగాలు ఖాళీగా వుంటే 80 వేల ఉద్యోగాలే భర్తీచేయడం ఏంటని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి విపక్షాలు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన రీతిలో విమర్శలు చేస్తున్నారు. 2004 – 14 వరకు ఉద్యమం లో యువత పెద్దన్న పాత్ర. 2014 – 22 వరకు ఉద్యోగాల కోసం యువత ఆశగా చూసారు. ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో నిరుద్యోగులు, యువత వ్యతిరేకంగా ఉన్నారని కేసీఆర్ తో చెప్పారన్నారు.

ఈరోజు నుండే 91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తున్నాయని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారన్నారు శ్రవణ్. ఈరోజు వరకు ఒక ఉద్యోగ ప్రకటన లేదు. సీఎస్ ఉద్యోగాల భర్తీ పై సమీక్షలో చెప్పిన మాటలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడడమేనన్నారు. కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ,మరికొన్ని బోర్డు ల ద్వారా రీక్యూటిమెంట్ లు చేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బోర్డుల ద్వారా నియామకాలు అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టడానికి కుట్ర జరుగుతుందన్నారు.

టీఎస్పీఎస్సీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. 300 మంది పనిచేసే చోట కేవలం 80 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే జరపాలి. బోర్డులు అంటేనే అవినీతి. నిరుద్యోగుల వ్యతిరేకత ను తగ్గించుకోవడానికి నియోజకవర్గాల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు దాసోజు శ్రవణ్. కోచింగ్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. 40 లక్షల మందికి ప్రభుత్వం నుండి స్టడీ సెంటర్ల ద్వారా కోచింగ్ ఇవ్వకుండా ఎమ్మెల్యేల ద్వారా ఎందుకు ఇప్పిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. నిరుద్యోగ భృతి 3వేలు చెల్లించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రయివేటు సెక్టార్లలో 90 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. బిస్వాల్ కమిటీ లో చెప్పిన లక్షా 91 వేలల్లో మిగిలిన లక్ష ఉద్యోగాలు ఎక్కడ అని ఎమ్మెల్యేలని గల్లా పట్టి అడగాలన్నారు. రాష్ట్రంలో జనాభాకు, ప్రభుత్వ ఉద్యోగులు 1.4 శాతం మాత్రమే ఉన్నారన్నారు శ్రవణ్.

https://ntvtelugu.com/nvss-prabhakar-slams-cm-kcr-tours-for-investments/
Exit mobile version