Hyderabad: రద్దీ రోడ్లపై ఆటోలతో ప్రమాదకర స్టంట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. అయితే కొంతమంది ఆకతాయిలు రోడ్డుపై వెళ్లేవారిని భయపెట్టేందుకు ఆటోలతో ప్రమాదకర విన్యాసాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు ఆటోలతో ప్రమాదకర రీతిలో స్టంట్లు చేశారు. ఈ తతంగాన్ని కొంతమంది స్థానికులు వీడియో తీశారు. ఈ మేరకు ఓ నెటిజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించారు.
ఆటోలతో ప్రమాదకర విన్యాసాలు చేసిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. నిందితుల్లో టోలీచౌకీకి చెందిన సయ్యద్ జుబేర్ అలీ (20), సయ్యద్ సాహిల్ (21), మహ్మద్ ఇబ్రహీం (22), మహ్మద్ ఇనాయత్ (23), గులాం సైఫుద్దీన్ (23), మహ్మద్ సమీర్ (19), అమీర్ ఖాన్ (20) ఉన్నారు. వీరు ఆటోలను అద్దెకు తీసుకుని నడుపుతుంటారని, గురువారం అర్ధరాత్రి బాబానగర్ నుంచి డీఆర్డీఎల్.. మళ్లీ అక్కడి నుంచి బాబానగర్‌కు వస్తూ విన్యాసాలు చేశారని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.
Also Read
- KTR: 'రాజ్యమా ఉలిక్కిపడు'.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్‌నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
- CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
Action required @HYDTP !#Santoshnagar#Chandrayangutta !! pic.twitter.com/oruw79VacZ
— Dr Chaitanya Singh (@MidnightReportr) February 25, 2022
తాజావార్తలు
-
Trisha: విజయ్ చిత్రం “జన నాయగన్”పై త్రిష రివ్యూ.. బాధగా ఉందన్న తల్లి..
-
Varun Tej: రిలీజ్‌కు ముందే వరుణ్ తేజ్ జాక్‌పాట్.. ‘కొరియన్ కనకరాజు’ రూ.26 కోట్ల బిజినెస్?
-
Shreyas Iyer Trolls: గెలిచినా శ్రేయస్‌పై విమర్శలు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై ప్రశ్నలు!
-
Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
-
Asian Games 2026 Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఒక్కటే ఛాన్స్!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!