హైదరాబాద్ నగరంలో రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. అయితే కొంతమంది ఆకతాయిలు రోడ్డుపై వెళ్లేవారిని భయపెట్టేందుకు ఆటోలతో ప్రమాదకర విన్యాసాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు ఆటోలతో ప్రమాదకర రీతిలో స్టంట్లు చేశారు. ఈ తతంగాన్ని కొంతమంది స్థానికులు వీడియో తీశారు. ఈ మేరకు ఓ నెటిజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించారు. ఆటోలతో ప్రమాదకర విన్యాసాలు చేసిన ఆరుగురిని…