Anirudh Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వేళ.. అనిరుధ్ సంపాదన ఎంతో తెలుసా.?
- కావ్యా మారన్‌తో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యారేజ్..
- గ్రీస్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్..
- పెళ్లి వేళ చర్చనీయాంశంగా అనిరుధ్ నెట్ వర్త్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anirudh Net Worth: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, సన్‌రైజర్ సీఈఓ, సన్ టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరిద్దరి పెళ్లి గ్రీస్‌లో నవంబర్ 11న జరుగుతోంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేళ అనిరుధ్ ఆస్తుల విలువ, ఆయన సంపాదనపై చర్చ జరుగుతోంది. ‘‘వై దిస్ కొలవెరి డి’’ సాంగ్‌తో ఒక్కసారిగా అనిరుధ్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ్, తెలుగు, హిందీ సినిమా ఇండస్ట్రీల్లో ఇప్పుడు అనిరుధ్‌కు ఫుల్ క్రేజ్ ఉంది.
అనిరుధ్ నికర ఆస్తుల విలువ సుమారు రూ. 50 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీల్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ఒకరు. ఆయన ఒక్కో సినిమాకు సుమారు రూ. 8 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఈ మొత్తం రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నారు. అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రానున్న సినిమాకు ఏకంగా రూ. 25 కోట్ల ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- AA23: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్.. లోకేష్ ప్రాజెక్ట్ టైటిల్ ఇదేనట!
- Priya Bhavani Shankar Wedding: సైలెంట్‌గా ఏడడుగులు వేసిన హీరోయిన్.. 10 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు!
- Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్‌లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
- Anirudh Kavya Maran Wedding: గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
అనిరుధ్ వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్ కనిపిస్తుంది. 2023లో ‘జైలర్’ సినిమా విజయవంతమైన సందర్భంగా కావ్య మారన్ తండ్రి, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ అనిరుధ్‌కు సుమారు రూ.1.1 కోట్ల విలువైన పోర్షే మకాన్ కారును బహుమతిగా అందించారు. ఇదే కాకండా అనిరుధ్ వద్ద బీఎండబ్ల్యూ iX1 LWB, మహీంద్రా BE 6, ఫోర్డ్ మస్టాంగ్ GT వంటి కార్లు ఉన్నాయి.
ఇక మ్యూజిక్కు మాత్రమే అనిరుధ్ పరిమితం కాకుండా వ్యాపారరంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. 024లో దక్షిణ భారత ఫిల్టర్ కాఫీ, స్నాక్స్ బ్రాండ్ ‘VS Mani & Co’లో సహ వ్యవస్థాపకుడిగా, బ్రాండ్ అంబాసిడర్‌గా చేరారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బ్రాండ్ విస్తరణ, మార్కెట్ వాటా పెంపు లక్ష్యంగా ఈ భాగస్వామ్యం ఏర్పడింది.ఈ ఒప్పందంలో భాగంగా అనిరుధ్‌కు కంపెనీలో ఈక్విటీ వాటా కూడా లభించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Anirudh Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వేళ.. అనిరుధ్ సంపాదన ఎంతో తెలుసా.?
-
Censor Board: టాలీవుడ్ నిర్మాతలకు సెన్సార్ కక్షసాధింపు గండం
-
Honour Killing: వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. దీపావళిలో రోజే కుమార్తె హత్య.
-
AA23: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్.. లోకేష్ ప్రాజెక్ట్ టైటిల్ ఇదేనట!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలే లాభాలు.. ధైర్యంతో పెట్టుబడి పెట్టిన వారికి వరించిన ధనలక్ష్మి..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!