Facebook Page Hack: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం, నోటిఫికేషన్‌లను ఎప్పటికప్పుడు చూసి వాటిని రిప్లై ఇవ్వడం.. చాలా మందికి అలవాటుగా మారింది. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వ్యక్తిగత ఖాతాలను కొందరు కేటుగాళ్లు హ్యాక్ అవుతున్నాయి. సైబర్ నేరగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా పేజీలను హ్యాక్ చేసి డబ్బులు దండుకుంటున్న హ్యాకర్లు.. పోలీసు శాఖ ఫేస్‌బుక్ పేజీని హ్యాక్ చేసిన విషయం మరిచిపోకముందే.. ఇప్పుడు తాజాగా ఓ మంత్రి ఫేస్ బుక్ పేజీనే హ్యాక్ చేయడం సంచలనంగా మారింది. ఆయన ఎవరో కాదు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఈయన ఫేస్‌బుక్ పేజీను కొందరు హ్యాక్ చేశారు. దామోదర రాజనరసింహ ఫేస్ బుక్ లో రాజకీయాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసిన నాయకులు, ప్రజలు ఒక్కసారిగా బీజేపీ, టీడీపీ, తమిళనాడుకులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులు రావడంతో షాక్ తిన్నారు. దామోదర ఫేస్ బుక్ లో వీటికి సంబంధించన పోస్ట్ లు రావడం ఏంటని గుస గుస లాడుకున్నారు.
Read also: Prabhala Theertham: ఏమిటా ప్రభల తీర్థం..? ప్రత్యేకత ఏంటి..?
అయితే కొందరు నాయకులు దామోదరకు మీ ఫేస్ బుక్ లో పోస్ట్ ఏంటి సార్ అలా పెట్టారు? అని ప్రశ్నించారు. అయితే దామోదర మా పార్టీకి సంబంధిచినవే కదా అని చెప్పడంతో ఖంగు తిన్నారు. కాదు సార్ మీ పార్టీకి సంబంధించినది అయితే మీకు ఎందుకు అడుగుతాము.. ఒక్కసారి మీ ఫేస్ బుక్ చెక్ చేసుకోండి, మీ ఫేస్ బుక్ లో బీజేపీ, టీడీపీ, తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులను వందల సంఖ్యలో పెట్టారు. దాని వల్ల వాటికి సంబంధించిన పోస్ట్ లు మీతో ఫేస్ బుక్ కు కనెక్ట్ వున్న వారందరికి వెళుతున్నాయి అని చెప్పారు.
దీంతో అప్రమత్తమైన మంత్రి దామోదర తన ఫేస్ బుక్ అకౌంట్ ను పరిశీలించుకున్నారు. అంతే మంత్రి ఒక్కసారి నిర్ఘాంత పోయారు. వెంటనే అధికారులకు అప్రమత్తం చేశారు. తన ఫేస్ బుక్ ఎవరో హ్యాక్ చేశారని తెలిపారు. దీంతో అధికారులు స్పందించారు. హ్యాకర్లను పట్టుకునే పనిలో పడ్డారు. మంత్రి దామోదర ఫేస్ బుక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్ లకుస్పందించవద్దని మంత్రి అనుచరులు కార్యకర్తలకి మనవి చేశారు. మంత్రి నుంచి ఏదైనా సరే మెసేజ్ వచ్చినా దానికి రిప్లై ఇవ్వద్దని, ఆ సమాచారాన్ని పోలీసులకు తెలిపాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Prabhala Theertham: ఏమిటా ప్రభల తీర్థం..? ప్రత్యేకత ఏంటి..?