NTV Telugu Site icon

Cyber Crime: తెలియని నంబర్‌.. సెక్సీ డీపీ.. రూ.లక్షలు కొల్లగొడుతున్న సైబర్‌ మోసగాళ్లు

Cyber Crime

Cyber Crime

Cyber Crime: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు మరింత రెచ్చిపోతున్నారు. హలో మిస్టర్.. మీరు నా కాల్‌లకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? మీకు ఎంతసేపు ప్రయత్నిస్తున్నారో తెలుసా? నువ్వు ఇప్పుడు ఏమిచేస్తున్నావు? తిన్నావా? నాతో కాసేపు చాట్ చేయగలవా?’ అంటూ గుర్తు తెలియని నంబర్ల నుంచి ముఖ్యంగా ఫ్యాన్సీ నంబర్ల నుంచి ఎంపిక చేసిన ఫోన్ నంబర్లకు వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ర్యాండమ్ మెసేజ్ లు పంపుతున్నారు. అందమైన అమ్మాయిల సెక్సీ డీపీలతో పోస్ట్ చేస్తూ ఉద్యోగం, వ్యాపారం పేరుతో చాటింగ్‌లు చేస్తున్నారు. ఆ తర్వాత, మీరు గిఫ్ట్ కార్డ్‌లను కొనుగోలు చేస్తే, మీ బ్యాంక్ ఖాతాలో డబుల్ డబ్బు వస్తుంది. మీరు YouTubeలో వీడియోలను చూడటం.. కామెంట్లు.. రివ్వీలు వ్రాయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

Read also: The Greatest of All Time : పొంగల్ కానుకగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్..వైరల్ అవుతున్న పోస్టర్..

ఒక్కో వ్యాఖ్యకు రూ.50 చెల్లిస్తామని నమ్మించి రివ్యూలు రాసేందుకు లింక్ లు పంపిస్తున్నారు. వారు లింకులు నిజమే అని నమ్మి ఓపెన్ చేస్తే… మెల్లగా టార్గెట్లు ఇస్తున్నారు. రూ.1,000 పెట్టుబడి పెడితే రూ.3,000 లాభం వస్తుందని చెబుతున్నారు. ఆ టార్గెట్ ను పూర్తి చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఖాతా తెరిచి, వచ్చిన డబ్బు మొత్తాన్ని అందులో జమ చేస్తారు. ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే క్రమంలో రూ.కోటి వసూలు చేసి మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి సందేశాలకు స్పందించవద్దని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే 1930 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Fennel Seeds: భోజనం తింటూనే సోంపు గింజలు నమిలితే?

Show comments