సోంపు గింజలు. వీటిని తరచుగా మనం భోజనం చేసాక నోట్లో వేసుకుని నములుతుంటాం.
సోంపు గింజలు తింటే తిమ్మిర్లు, నొప్పి, గ్యాస్ట్రిక్ రుగ్మతలు వంటి కడుపు సంబంధ సమస్యలకు ఇది చాలా ప్రభావవంతమైన ఔషధం.
సోంపు తింటే కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు, కాబట్టి భోజనం చేసాక 30 నిమిషాల తర్వాత ఒక చెంచా సోంపు తినవచ్చు.
రుతుక్రమం సక్రమంగా ఉండేందుకు సోంపు తినడం మేలు చేస్తుంది. బెల్లం కలిపి తింటే ఇంకా మంచిది.
పసిబిడ్డలకు కడుపు నొప్పితో బాధపడుతుంటే సోంపు వాటర్ తాగిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రోజూ 5-6 గ్రాముల సోంపును తీసుకోవడం వల్ల కాలేయం, కంటిచూపు ఆరోగ్యంగా ఉంటుంది.
సోంపును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
వేయించిన సోంపును పంచదార మిఠాయితో కలిపి తింటే కఫం, దగ్గును దూరం చేస్తుంది.
అత్తి పండ్లతో సోంపును కలిపి తింటే దగ్గు, బ్రాంకైటిస్ దూరమవుతాయి.
ఉబ్బసం చికిత్సలో సోంపు అద్భుతంగా పనిచేస్తుంది.