Cheetah in Shamshabad: హైదరాబాద్ లోని శంషాబాద్ శివారులో చిరుత పులి సంచారం భయాందోళనకు గురిచేస్తుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామ శివారులోని సీతారామ చంద్ర స్వామి ఆలయం సమీపంలో చిరుత పులి సంచరిస్తుందంటూ గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాలు ఆధారంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రాజేంద్రనగర్ అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Read also: Mega Sankranthi Celebrations: బెంగళూరులో సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ
సీసీ కెమెరాలు చూసిన దృశ్యాలను బట్టి చిరుత కాదు అడవి పిల్లి అని అధికారులు తేల్చేశారు. స్థానికులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని సూచించారు. ఏదైనా క్రూర జంతువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. చిరుత పులి సంచారం చేస్తుందని పుకార్లు పుట్టించడం సరికాదని అన్నారు. పుకార్లు పుట్టించే ముందు అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించామని అది చిరుత కాదని క్లారిటీ వచ్చిందన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన పనిలేదని అన్నారు.
Fennel Seeds: భోజనం తింటూనే సోంపు గింజలు నమిలితే?