Fake gang: రాష్ట్ర రాజధాని నగరంలో కల్తీ ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతోంది. నకిలీ తయారీ కేంద్రాలపై ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు నిర్వహించి కల్తీ నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా కానీ.. ఇలాంటి కల్తీ కేడీలు రోజురోజుకు బయటికి వస్తూనే ఉన్నారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కల్తీ సరుకులు తయారు చేస్తున్న ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు. కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 500 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, లిటిల్ చాప్స్ అనే మ్యాంగో డ్రింక్ స్వాధీనం చేసుకున్నారు.
Read also: KTR: నా కొడుకు టాలెంట్ చూసి షాక్ అయ్యా..
కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతారు. మనుషుల జీవితాలతో ఆడుకుంటూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న ఈ అక్రమార్కులు.. వెల్లుల్లిపాయల తొక్కను కూడా వదలడం లేదు. యంత్రాల్లో కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పాటు వెల్లుల్లిపాయల పొట్టు వేసి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పరిశ్రమలో అపరిశుభ్రత, వ్యర్థ జలాల వినియోగం, ప్రమాదకర రసాయనాలను గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మేనేజర్ కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పరిశ్రమను నడుపుతున్నాడు. గత కొన్నేళ్లుగా ఈ నకిలీ దందా కొనసాగుతోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. పరిశ్రమ యాజమాన్యం ఇచ్చే కానుకలపై అధికారులు సైతం ఆశలు పెట్టుకుని కళ్లు బైర్లు కమ్మని పరిస్థితి. 500 కిలోల అల్లం, వెల్లుల్లి పేస్ట్, హెవీ మ్యాంగో కూల్ డ్రింక్, ప్రమాదకర రసాయనాలు, మనుషులను చంపే వైట్ పౌడర్, 210 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 550 కిలోల నాన్ వెజ్ మసాలా ప్యాకెట్లు, టన్ను వెల్లుల్లి… స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
Hare Krishna Heritage: హరే కృష్ణ హెరిటేజ్ టవర్.. రేపు భూమిపూజ కార్యక్రమంలో సీఎం