Site icon NTV Telugu

Oneplus Store : గిట్లకూడ ఉంటదా..? రిపేర్‌కు ఇచ్చిన ఫోన్ తిరిగివ్వమంటే కస్టమర్లకు బెదిరింపులు..

One Plus

One Plus

Oneplus Store : హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్‌లో ఫోన్ రిపేర్ కోసం వచ్చిన కస్టమర్లకు ఎదురైన అనుభవం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సర్వీస్ సెంటర్ సిబ్బందితో పాటు నారాయణగూడ పోలీసులు కస్టమర్లపై దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కస్టమర్లు తమ ఫోన్‌లను రిపేర్ చేయించేందుకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లగా, రెండు నెలలు గడిచినా ఫోన్‌లను తిరిగి అందజేయలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సర్వీస్ సెంటర్ మేనేజర్‌ను ప్రశ్నించిన కస్టమర్లతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మేనేజర్ “నేను ఫోన్ చేస్తే రెండు నిమిషాల్లో పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు” అంటూ కస్టమర్లను బెదిరించినట్లు సమాచారం.

Israel-Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి ప్రయోగం.. ప్రముఖ ఆస్పత్రి ధ్వంసం

మేనేజర్ ఫోన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే పోలీసులు సర్వీస్ సెంటర్‌కు చేరుకున్నారు. పోలీస్ కానిస్టేబుళ్లు కస్టమర్లను సర్వీస్ సెంటర్ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశిస్తూ, “ఇక్కడ న్యూసెన్స్ సృష్టిస్తే మీపై కేసు నమోదు చేస్తాం” అంటూ హెచ్చరించారు. దీనికి కస్టమర్లు, “మేము మా ఫోన్‌లను తిరిగి ఇవ్వమని అడుగుతున్నామే తప్ప, ఎందుకు బయటకు వెళ్లాలి?” అంటూ ప్రశ్నించారు.

అయినప్పటికీ, నారాయణగూడ ఎస్‌ఐ వెంకటేష్ కస్టమర్లపై “పోలీస్ విధులకు అడ్డంకి కలిగించారు” అంటూ కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సర్వీస్ సెంటర్‌లోని సీసీ కెమెరా ఫుటేజీని బయటపెట్టాలని కస్టమర్లు డిమాండ్ చేయగా, “సీసీ కెమెరాలు పనిచేయడం లేదు” అంటూ మేనేజర్ సమాధానమిచ్చారు. సర్వీస్ సెంటర్‌పై కేసు నమోదు చేయకుండా, కస్టమర్లపైనే అక్రమ కేసులు పెట్టిన నారాయణగూడ పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Extramarital Affair: కూతురి వివాహేతర సంబంధం.. మనవరాళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్న అమ్మమ్మ, అవ్వ!

Exit mobile version