CS Somesh Kumar : వరద సహాయక చర్యలు వేగవంతం చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పలు జలాశయాలు భారీ వర్షాల కారణం ఏర్పడ్డ వరదలకు నిండిపోయాయి. అయితే.. వరద సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో చేపడుతున్న సహాయక, పునరావాస చర్యలను సమీక్షించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూన్నట్లు మంత్రి తెలిపారు. సకాలంలో వరద సహాయాన్ని అందించినందుకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జిల్లాకు ఎన్డిఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి, రెస్క్యూ టీమ్‌లను తరలించారు. ఆ టీమ్ లను భద్రాచలం, కొత్తగూడెం పట్టణాల్లో ఉంచినట్లుయైతే, వరద సహాయక చర్యలు సమర్థవంతంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. వరద నీరు 80 అడుగులకు చేరినా పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ముంపునకు గురయ్యే గ్రామాలు, ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి ప్రత్యేక పునరవాస శిబిరాలకు తరలించాలన్నారు. ఇప్పటికే భద్రాచలంలో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీకి చెందిన 5 బృందాలు, సింగరేణి రెస్క్యూ టీమ్‌లు సిద్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు. వరదల సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని ప్రధాన కార్యదర్శి పునరుద్ఘాటించారు. ఆస్తినష్టం జరగకుండా కూడా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. అన్ని సహాయక శిబిరాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ రాత్రికి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ఐటీసీ భద్రాచలం వద్ద ఉంటుందని తెలిపారు. సహాయక చర్యలలో జిల్లా యంత్రాంగానికి తోడ్పాటుగా మరో నలుగురు సీనియర్ RDOలను నియమించారు. ఇవాళ రాత్రికి 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్లు, బస్సులు, ట్రక్కులు కూడా భద్రాచలంనకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు, పర్యవేక్షించేందుకు పోలీసు ఉన్నతాధికారులకు కూడా బాధ్యతలు అప్పగించినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!