Koonanneni Sambasiva Rao: ఇవాల్టి రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చిన ఎట్ హోం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది. హైదరాబాద్ హిమాయత్ నగర్ మక్దూం భవన్ సీపీఐ కార్యాలయంలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కూనన్నె మాట్లాడుతూ సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేపడుతున్నామన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన పాలకులు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పీఠిక నుంచి లౌకికవాదం, సోషలిజం అనే పదాలను తొలగించే కుట్ర జరుగుతోందన్నారు.
Read also: BRS Leaders Fight: ఓవైపు జెండా ఆవిష్కరణ.. మరోవైపు బీఆర్‌ఎస్ లీడర్ల ఫైట్
రాజ్యాంగ పరిరక్షణ కోసం సీపీఐ పోరాటం చేస్తుందని కూనంనేని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమపై పోలీసులు అక్రమ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. భూసమస్యపై అబ్దుల్లాపూర్ మెట్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని తమకు మద్దతిస్తే తనపై ఐపీసీ 123బీ సెక్షన్ విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎవరిపైనా ఆయుధాలతో దాడి చేసేందుకు వెళ్లలేదని, పేద ప్రజల భూ పోరాటానికి మాత్రమే మద్దతిచ్చామని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజాసమస్యల కోసం సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు బీఆర్‌ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నామన్నారు.
Read also: MLA Sanjay Kumar: భోగ శ్రావణి రాజీనామా.. స్పందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని కూనన్నే ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచితే… ఆ పాపంలో సీపీఐకి భాగస్వామ్యం ఉందంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికి తనపై రెండు కేసులు నమోదైన విషయం రేవంత్ రెడ్డి గ్రహించాలని, తన వ్యాఖ్యలను రేవంత్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్న కూనంనేని, గతంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని తామే పోరాటం చేశామని చెప్పారు.
Balakrishna: నాకు 60 సంవత్సరాలు అంటే వాడికి దబిడి దిబిడే