CPI Narayana: పవన్ ఓ రాజకీయ బ్రోకర్.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana Fires On Pawan Kalyan For Joining Hands With BJP: జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై సీపీఐ నారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏతో పవన్ కలవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మతవాద పార్టీ అయిన బీజేపీతో పవన్ చేతులు కలపడం.. ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి ప్రమాదకరమని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ బ్రోకర్‌లా మారారని.. టీడీపీని ఎన్డీఏకు దగ్గర చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ మధ్య అనుసంధానం చేసేందుకు పవన్ ఓ దళారీ అవతారమెత్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆ రెండు పార్టీల్ని పవన్ కలిపితే.. ఏపీలో వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అవుతుందన్నారు. బీజేపీతో జతకట్టిన కూటమికి వ్యతిరేకంగా.. మైనారిటీలందరూ ఏకమై, వైసీపీని గెలిపించడం ఖాయమని తేల్చి చెప్పారు.
MP Ranjith Reddy: కాంగ్రెస్‌పై ఎంపీ రంజిత్ ఫైర్.. ఎన్ని నిందలేసినా ప్రజలు నమ్మరు
Also Read
గతంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పవన్ పోల్చారని.. ప్రత్యేక హోదా హామీ ఇచ్చి, ఆ హామీని ఇప్పటివరకూ నెరవేర్చని బీజేపీతో పవన్ ఎలా అంటకాగుతారని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. నిన్నటిదాకా చేగువేరా దుస్తులు ధరించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు దారి తప్పి మితవాద సంస్కరణల సావర్కార్ వైపు నడవడం సరికాదని హితవు పలికారు. పవన్ వైఖరి చూస్తుంటే.. రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు. పవన్‌కి రాజకీయ స్థిరత్వం లేదని.. కదలకుండా మూడు నిమిషాలు మాట్లాడగలిగితే, ఆ తర్వాత పవన్ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చని ఎద్దేవా చేశారు. తమతో పొత్తులు పెట్టుకోని ప్రాంతీయ పార్టీలపై సీబీఐ, ఈడీ సంస్థలతో దాడులు చేయించడం బీజేపీకి పవన్ మద్దతు పలకడం శోచనీయమని వెల్లడించారు.
Priya Prakash Varrier: స్లీవ్ లెస్ టాప్ ధరించి కాక రేపుతున్న ప్రియా ప్రకాష్ వారియర్
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?