Site icon NTV Telugu

CPI Narayana: బండి సంజయ్‌వి పనికిమాలిన మాటలు..!

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana fire on Bandi Sanjay: బండి సంజయ్ పై సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు. మునుగోడు లో పోటీ చేయాలా వద్దా అనేది మేము తెల్చుకుంటామని మాగురించి చెప్పడానికి నువ్వెవవడివి కోన్‌ కిస్కావి అంటూ మండిపడ్డారు. బండి సంజయ్‌ వి పనికిమాలిన మాటలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మాగురించి మాట్లాడే టప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, దమ్ము, ధైర్యం గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? అంటూ ప్రశ్నించారు. నీకున్న దమ్ము ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీ నుండి వచ్చిన దమ్మే తప్పితే… ఇంకేముంది నీదగ్గర బండి సంజయ్‌ అంటూ నిప్పులు చరిగారు.

read also: Karnataka: ఇరు వర్గాల మధ్య చిచ్చురాజేసిన ప్రేమ వ్యవహారం.. ఇద్దరు మృతి

మీగురించి మాట్లాడుకో అంతే గాని మాగురించి మాట్లాడే అర్హంత, దమ్ము నీకు లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. మా గురించి ప్రశ్నించే అధికారం నీకెక్కడిది అంటూ మండిపడ్డారు. మేము చర్చించుకుని మునుగోడులో పోటీ చేయాలా వద్దా అని నిర్ణయించుకుంటాం. అంతేగానీ నీ సలహాలు మాకేమి అక్కర్లేదని, దమ్ము గురించి మాట్లాడేముందు కాస్త ఆలోచించుకుని మాట్లాడాలని బండి సంజయ్‌ పై సీపీఐ నారాయణ ఫైర్‌ అయ్యారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిన్న గురువారం 9వ రోజు కొనసాగిన విషయం తెలిసిందే. అయితే.. కార్యకర్తల్లో జోష్ నింపడానికి బండి సంజయ్ టీఆర్ఎస్ నేతలపై సెటైర్లు వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని, వారిని కేసీఆర్ వెళ్లనివ్వాలని బండి సంజయ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా, విజయం బీజేపీదేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఓటు వేసి.. బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.
Chikoti Praveen Petition: ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీస్ భద్రత కావాలి..!

Exit mobile version