తెలంగాణలో మావోయిస్టులు తమ అస్థిత్వం కోసం పోరాటం చేస్తున్నారు. అక్కడక్కడా అలజడి సృష్టిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సిపిఐ మావోయిస్ట్ వారోత్సవాల నేపద్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహముత్తారం ,పలిమెల,మల్హర్ ,మహదేవపూర్,కాటారం మండలాలోని మావోయిస్ట్ ప్రభావిత గ్రామాలలో పోలీసులు నిత్యం కార్డన్ సెర్చ్,వాహన తనిఖీలు నిర్వహిస్తూ,గోదావరి పరివాహక ప్రాంతాలలో పోలీసులు డెగ కన్ను వేశారు.అడవులలో సీఆర్పీఎఫ్,స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
మారుమూల పలిమెల మండలంలోని ముకునూర్ గుత్తికోయ గూడెంలో శనివారం కాటారం డిఎస్పీ కిషన్ ఆధ్వర్యంలో కమ్మూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలతో సమావేశమయ్యారు. మావోయిస్ట్ వారోత్సవాల నేపద్యంలో అందరు అప్రమత్తంగా ఉండాలని ,ప్రలోభాలకు గురికావద్దని ,సంఘ విద్రోహక వ్యక్తులకు సహకరించిన,ఆశ్రయం కల్పించిన వారికి చట్టా రిత్యా చర్యలు తప్పవని డీఎస్పీ కిషన్,సిఐ కిరణ్ హెచ్చరించారు. గుత్తికోయ ప్రజలకు బెడ్ షీట్లు,పండ్లు పంపిణీ చేశారు. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు చేసే హింస తట్టుకోలేక అక్కడి నుండి వలస వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్లు గుత్తికోయ ప్రజలు ఖాకీలకు తెలిపారు. మీ మీ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
Wishes: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రముఖ నటి జయప్రద