ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నక్సలైట్లు ముగ్గురు గ్రామస్థులను చంపేశారు. బాధితులను తాళ్లతో గొంతు కోసి దారుణంగా చంపారు. ఈ దాడి స్థానికుల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి నక్సలైట్లు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వామపక్ష తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడంలో భద్రతా దళాలు గణనీయమైన విజయాలు సాధిస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి దాడి జరగడం గమనార్హం .
Bears Dead: ఛత్తీస్ గడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలుడు కారణంగా మూడు ఎలుగుబంట్లు మృతి చెందాయి. ఈ పేలుడు మావోయిస్టులు ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్)ను అమర్చడం ద్వారా జరగింది. ఫారెస్ట్ అధికారులు ఈ విషయన్నీ ధృవీకరించారు. పేలుడు కారణంగా ఓ ఆడ ఎలుగుబంటి, దాని రెండు పిల్లలు అక్కడే మృతిచెందాయి. మావోయిస్టులు ఈ బాంబులను జవాన్లను లక్ష్యంగా చేసుకుని అమర్చారు. ఎలుగుబంట్ల పాదాలు బాంబును…