Site icon NTV Telugu

CPI Narayana: దేశవ్యాప్తంగా మేం కాంగ్రెస్‌తోనే.. కానీ, ఇక్కడ కాంగ్రెస్‌ కొంప సరిగా లేదు..!

Cpi Narayana

Cpi Narayana

ఉన్నది ఉన్నట్టుగా.. కుండ బద్ధలు కొట్టినట్టుగా మాట్లాడుతుంటారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. అవే ఆయన్ను కొన్నిసార్లు చిక్కుల్లో నెట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు.. క్షమాపణలు కోరిన ఘటనలు కూడా ఉన్నాయి.. అయితే, తాజాగా ఆయన కాంగ్రెస్‌ పార్టీపై చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. అన్ని పార్టీలో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ఇక, అధికార టీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించింది సీపీఐ.. దీనిపై ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ వ్యవహారాన్ని బట్టి తాను మాట్లాడతానన్నారు.. సందర్భం బట్టి మాట్లాడతానని తెలిపారు నారాయణ..

Read Also: Munugodu By Poll: రేవంత్‌ సంచలన ప్రకటన.. వెనక్కి వస్తే రాజగోపాల్ రెడ్డికే బీ ఫామ్

దేశ వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నామని స్పష్టం చేశారు నారాయణ.. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీపై హాట్‌ కామెంట్లు చేశారు.. ఇక్కడ కాంగ్రెస్ కొంప సరిగా లేదని తేల్చేశారు.. ఇక, భవిష్యత్తు రాజకీయాలకు ఎవరు భరోసా ఇవ్వరని వ్యాఖ్యానించారు నారాయణ. కాగా, మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించింది సీపీఐ పార్టీ… కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే కాగా.. బైపోల్‌లో విక్టరీ కొట్టి.. బీజేపీ దూకుడు బ్రేక్‌లు వేయాలని భావిస్తోంది టీఆర్ఎస్‌.. దాని కోసం కలిసివచ్చేవారి మద్దతు తీసుకుంటుంది.. అందులో భాగంగా సీపీఐ మద్దతు కోరడం.. వారు కూడా అంగీకరించడం జరిగిపోయాయి.. మునుగోడులో టీఆర్ఎస్‌కు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు చాడ వెంకట్‌రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం గా వచ్చింది.. రాజగోపాల్ రెడ్డి స్వార్దం కోసం పార్టీ మారారు.. ఉప ఎన్నిక ప్రజలపై రుద్దారన్నారు. మేం మునుగోడులో నిలబడాలి.. కానీ, బీజేపీని ఓడించే వారికి మద్దతు ఇవ్వాలి అనుకున్నాం.. అందుకే.. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని క్లారిటీ ఇచ్చారు. బీజేపీని ఓడించే శక్తి టీఆర్ఎస్‌కే ఉందన్నారు. అందుకే మేం టీఆర్ఎస్‌కి మద్దతు ఇచ్చామని తెలిపారు చాడ వెంకట్‌రెడ్డి.

Exit mobile version