NTV Telugu Site icon

CP Anand : నిమజ్జనాల కోసం మండప నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం…

Hyderabad Cp Anand

Hyderabad Cp Anand

సెప్టెంబర్ 17వ తేదీన గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్‌లో రూట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అన్ని శాఖల అధికారులు, హై లెవెల్ కమిటీ అంత కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, బాలాపూర్ రూట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం.. ఇదొక్కటి కాదు చిన్న చిన్నవి నిమజ్జనానికి వెళ్లేలా జోనల్ కమిషనర్ లు అన్ని పరిశీలిస్తున్నారమన్నారు. GHMC, కలెక్టర్ రోడ్డు రిపైర్స్, రోడ్డుగా అడ్డంగా ఉన్న చెట్లు , వైర్లు తొలిగించారని, నిమజ్జనాల కోసం మండప నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నామని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం.. పెండింగ్ పనులు అన్ని ఇవ్వల పూర్తవుతాయన్నారు సీపీ ఆనంద్‌.

K.K. Mahender Reddy : ఆధునిక యంత్రాలు తీసుకొచ్చి నేత కార్మికులకు పని కల్పిస్తాం

అంతేకాకుండా..’నిమజ్జనం రోజు 25వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు.. 15వేలు సిటీ పోలీసులు,10వేల మంది డిజిపి,జిల్లాలనుండి పోలీసులు వస్తున్నారు.. హుస్సేన్ సాగర్ వైపు వస్తున్న ట్రైకమిషనరేట్ పరిధిలోని విగ్రహాలు ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం.. హుస్సేన్ సాగర్ వద్ద ఘనంగా నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేసాం.. రోజురోజుకు నిమజ్జనాల రద్దీ పెరుగుతుంది.. రద్దీకి అనుగుణంగా క్రెయిన్, వెహికిల్స్ ఏర్పాటు చేసాం…. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం 1.30లోపు అవుతుంది.. ఉదయం 6న్నార గంటలకే పూజలు అన్ని పూర్తి చేసుకొని తరలిస్తాం అన్నారు…. మండప నిర్వాహకులు రాత్రి అన్ని పూర్తిచేసుకుని ఉదయాన్నే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కోసం తరలిస్తారు.. 70 అడుగుల విగ్రహము 6న్నార గంటలకు క్రెయిన్ పైకి తరలించనున్నారు.. పోలీసులు, ghmc, రెవిన్యూ అధికారులు సమన్వయంతో కష్టపడి ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం త్వరగా అయ్యేలా చేస్తారు.. పబ్లిక్ గార్డెన్ లో ప్రభుత్వం పరంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సీఎం నేతృత్వంలో జరగనుంది.. బిజెపి ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో జరగనుంది.. సౌత్ జోన్ లో MIM ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ ఉండనుంది.. కార్యక్రమలు, ర్యాలీలు, నిమజ్జనాల కోసం బందోబస్తు ఏర్పాటు చేసాం..ప్రశాంతంగా ముగుస్తాయని భావిస్తున్నాం..’ అని సీపీ ఆనంద్‌ తెలిపారు.

Duleep Trophy: సన్ గ్లాసెస్ ధరించి బ్యాటింగ్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు