టీఎస్ఆర్టీసీ మరోసారి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. తాజాగా టికెట్ రేట్లను మరోసారి పెంచింది. డిజిల్ సెస్ పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెరుగుతున్న డిజిల్ ధరలు, నష్టాలు ఆర్టీసీని కుదేలు చేస్తున్నాయి. దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు మరోసారి ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదనపు డిజిల్ సెస్ అనివార్యమని ఆర్టీసీ భావించింది. అయితే తక్కువ దూరం ప్రయాణికులపై భారం పడకుండా స్లాబ్ లను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణించే ప్రయణీకులకు భారం పడకుండా స్లాబ్ లను నిర్ణయించింది. గ్రేటర్ పరిధిలో డిజిల్ సెస్ పెంపు లేదని ఆర్టీసీ ప్రకటించింది.
పల్లె వెలుగు సర్వీసుల్లో 250 కిలోమీటర్ల దూరానికి రూ. 5 నుంచి రూ. 45కు, ఎక్స్ ప్రెసుల్లో 500 కిలోమీటర్ల దూరానికి రూ. 5 నుంచి రూ.90కి, డిలక్స్ సర్వీసుల్లో 500 కిలోమీటర్ల దూరానికి రూ. 5 నుంచి రూ. 125కు, ఏసీ సర్వీసుల్లో 500 కిలోమీటర్ల దూరానికి రూ. 10 నుంచి రూ. 170కి డిజిల్ సెస్ పెంచుతూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అయితే తక్కువ దూరం ప్రయాణికులపై భారం పడకుండా చర్యలు తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్సులపై డిజిల్ సెస్ విధించకపోవడంతో నగర వాసులపై ప్రభావం పడటం లేదు. ప్రస్తుతం పెరిగిన టికెట్ ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి.