Knee Sounds Tips: కీళ్ల నుంచి శబ్దాలు వస్తూ.. నొప్పులు బాగా ఉన్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Knee Sounds : చాలామందికి నడిచేటప్పుడు వారి మోకాళ్ల నుండి శబ్బం వస్తుంటుంది.. వారు ఎక్కువగా కూర్చునే టప్పుడు, నడుస్తున్నప్పుడు ఈ శబ్దం వస్తుంది. దీనిని జాయింట్ క్రెపిటేషన్ అంటారు. కీళ్ల మధ్య జిగురు తగ్గడం వల్ల నడిచేటప్పుడు ఈ శబ్దం వినిపిస్తుంది. శబ్దం రావడమే కాదు.. అలా నడుస్తున్న, కూర్చుంటున్నా.. విపరీతమైన నొప్పి , వాపు వస్తుంటుంది. మోకాళ్ల నొప్పులు, వాపులు, నడిచేటప్పుడు మోకాళ్ల నుంచి శబ్దం రావడం వంటి సమస్యలతో బాధపడేవారు వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి సమస్య తలెత్తిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. దీనికి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అది మరింత తీవ్రమై జీవిత కాలం వేధించే అవకాశం ఉందని అంటున్నారు. కావున ఇటువంటి సమస్యలతో బాధపడే వారు ఈ మూడు పదార్థాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Read also: AP-TS MLC Election: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
మెంతులు బాగా పనిచేస్తాయి. మోకాళ్ల నుండి వచ్చే శబ్దాన్ని తగ్గించడంలో మెంతులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని రోజూ రాత్రి ఒక టీ స్పూన్ మెంతులను నీటిలో వేసి నానబెట్టి.. మరుసటి రోజూ ఉదయం ఈ మెంతులను నీటితో సహా ఉడికించాలి. ఆ..తరువాత వీటిని వడకట్టుకుని నీటిని తాగాలి. అనంతరం మెంతి గింజలను నమిలి తినాలి. ఈవిధంగా.. చేయడం వల్ల మోకాళ్ల నుండి శబ్దం రావడం తగ్గుతుంది. అంతేకాకుండా.. మోకాళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి. మెంతులు వాడడం వల్ల శరీరంలో వేడి చేస్తుంది. కావున వీటిని గర్భిణీ స్త్రీలు అస్సలు వాడకూడదు. అంతేకాదు.. వేడి వల్ల చర్మంపై అలర్జీలు వచ్చే వారు కూడా ఈ మెంతులను వాడకూడదు. అయితే.. మోకాళ్ల సమస్యలతో బాధపడే వారు ప్రతిరోజూ ఒక గ్లాస్ పాలల్లో చిటికెడు పసుపును కలిపి తాగాలి. ఈవిధంగా.. చేయడం వల్ల మోకాళ్లకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తగ్గడమే కాకుండా.. శరీరానికి తగినంత క్యాల్షియం లభించి ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఇక.. నడిచేటప్పుడు మోకాళ్ల నుండి శబ్దం రాకుండా ఉంటుంది. అయితే.. మోకాళ్ల సమస్యలతో బాధపడే వారు తీసుకోవాల్సిన మరో పదార్థం వేయించిన శనగలు, బెల్లం. ఈరెండింటిని కలిపి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల నుండి శబ్దం రావడం కూడా తగ్గుతుంది. శనగలు, బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి. వీటిని రోజూ గుప్పెడు వేయించిన శనగలను, నిమ్మకాయంత బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల కీళ్ల సమస్యలు ఇట్టే మాయమైపోతాయి. ప్రతిరోజూ ఈ మూడు పదార్థాలను తీసుకోవడం వల్ల మోకాళ్ల నుండి వచ్చే శబ్దాలు పూర్తిగా తగ్గడమే కాకుండా.. కీళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
144 section kcr residence: 2వ సారి ఈడీ విచారణకు కవిత.. ఢిల్లీలో కేసీఆర్ నివాసం వద్ద 144 సెక్షన్..
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!