Corona: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. హైదరాబాద్‌లోనే 247 కొత్త కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 21,918 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 443 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. రాష్ట్రంలో తాజాగా కరోనా కారణంగా మరణాలు ఏమీ నమోదు కాలేదు. కరోనా బారినపడి మొత్తం ఇప్పటివరకు 4,111 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 8,02,822 మంది కరోనా బారినపడగా…. 7,94,014 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 4,697 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రికవరీ రేటు 98.90 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.
అత్యధికంగా హైదరాబాద్‌లోనే 247 కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొన్నిరోజులుగా హైదరాబాద్ జిల్లాలో 250కి పైన రోజువారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇక, రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 30, సంగారెడ్డి జిల్లాలో 27 కేసులను గుర్తించారు. అదే సమయంలో 493 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్‌తో పాటు శానిటైజర్‌ను వాడాలని ప్రజలకు పదేపదే సూచిస్తున్నారు.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
HYD Rains: భాగ్యనగరంలో భారీ వర్షం.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది
కానీ కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కరోనా పుట్టినిల్లు చైనాలో సైతం కరోనా కేసులు భారీగా నమోదువుతుండడంతో కఠిన లాక్డౌన్ నిబంధనలు అమలు చేశారు. దీంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే భారత్‌లో కూడా థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటు ఫోర్త్ వేవ్ వచ్చిన ఎదుర్కొనగలమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!