Site icon NTV Telugu

Constable Sowmya : సౌమ్య కుటుంబానికి కోటి రూపాయల సాయం.! సోదరుడికి సర్కార్ ఉద్యోగం.!

Constable Sowmya

Constable Sowmya

విధి నిర్వహణలో గంజాయి మాఫియా పాలిట సింహస్వప్నంగా మారి, వీరమరణం పొందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (26) సాహసం యావత్ రాష్ట్రాన్ని కన్నీరు పెట్టించింది. ప్రాణాలకు తెగించి గంజాయి ముఠాను అడ్డుకున్న ఆమె మృతి పట్ల ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించింది. విధి నిర్వహణలో చేరిన ఏడాది కాలంలోనే ఆమె చూపిన తెగువ, గంజాయి ముఠాను పట్టుకోవడంలో ఆమె కనబరిచిన పట్టుదల పోలీసు శాఖలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సామాన్య కానిస్టేబుల్ స్థాయి నుంచి అసామాన్య పోరాటాన్ని ప్రదర్శించిన సౌమ్య మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా నివాళులు వెల్లువెత్తుతున్నాయి.

KCR : కేసీఆర్ భావోద్వేగం.. రాష్ట్ర సాధన కోసం వ్యూహాలు రచించిన గదిలోనే.. నేడు విచారణ..!

ఇటీవల నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా కదలికలను గమనించిన ఎక్సైజ్ అధికారులు వారిని పట్టుకునేందుకు మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సౌమ్య.. ముఠా సభ్యులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, పట్టుబడతామనే భయంతో ఆ గంజాయి ముఠా ఆమెను వాహనంతో బలంగా ఢీకొట్టి పరారైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు ఒక కిడ్నీని తొలగించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించినప్పటికీ, శనివారం ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

సౌమ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటనలు చేశారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసినందుకు గాను ఆమె కుటుంబానికి కోటి రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాకుండా సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు మంత్రి ప్రకటించారు.

India Budget 2026: మధ్యతరగతి ఆశలపై నీళ్లు.. సామాన్యుడి కన్నీళ్లు తుడవని నిర్మలమ్మ!

Exit mobile version