Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం భారత ఎన్నికల కమిషన్‌కు 40 మంది ప్రముఖ నేతల పేర్లను పంపారు. ఈ జాబితాలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత పీ. విశ్వనాథ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు చోటు చేసుకున్నారు.
Karur stampede: ‘‘దీపావళి జరుపుకోవద్దు’’.. యాక్టర్ విజయ్ పార్టీ సంచలన నిర్ణయం..
అలాగే సీనియర్ నాయకులు జానారెడ్డి, రేణుకా చౌదరి, వీ. హనుమంతరావు, అజారుద్దీన్, విజయశాంతి, సంపత్ కుమార్, దానం నాగేందర్, రాములు నాయక్, అంజన్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్‌లకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ బలమైన నాయకత్వాన్ని రంగంలోకి దించింది.
Samantha : డైరెక్టర్లు బోల్డ్ పాత్రలు ఇవ్వలేదు.. సమంత షాకింగ్ కామెంట్స్
